BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Thursday 27 October 2022

APPSC పోస్టుల భర్తీకి షెడ్యూల్| CPS ఉద్యోగులకు అరెస్టు వారెంట్లు| సచివా...

నేటి నుంచి వెబ్సైట్లో ఏపీపీఎస్సీ హాల్ టిక్కెట్లు


: వచ్చేనెల 3 నుంచి 7వ తేదీ, 16వ తేదీన నిర్వహించే ఉద్యోగ నియామకాల రాత పరీక్షలకు దరఖాస్తు చేసినవారు శుక్రవారం నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచిం చింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1, తెలుగు రిపోర్టర్స్ నియామ కాల పరీక్షలు వచ్చే నెలలో జరగనున్నాయి.

సచివాలయాల్లో కారుణ్య నియామకాలు

ప్రొబేషన్ సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అవకాశం

ఉత్తర్వులు జారీచేసిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్

: ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహ ణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలకు అను మతిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకా లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగు ణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రొబేషన్ సమయంలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడం పట్ల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.

 మునిసిపల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి తో ఉపాధ్యాయ నేతల భేటీ


 రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగ నేతలు ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. గురువారం తాడేపల్లిలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార చర్యల్లో భాగంగా సమావేశం నిర్వ హించారు. సమావేశానికి మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ తరుపున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి హేనా, రాష్ట్ర కార్యదర్శి ఏ ఓం రాము, ఎ రమణ తదితరులు హాజరయ్యారు. మున్సిపల్ టీచర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యాశాఖలో నూతన సంస్కరణల వల్ల 2114 పురపాలక పాఠశాలల్లో ఏటా 10 శాతం విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని రాష్ట్రవ్యాప్తంగా 335 మునిసిపల్ హైస్కూళ్లలో 2400 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘం నేతలు వివరించారు. మునిసిపల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి స్కూల్/  ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారిని, హైస్కూలు విద్యా వలంటీర్లను నియమించాలని కోరారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయు లను డీడీఓలుగా పదోన్నతి కల్పించటంతో పాటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల జీతాలను అర్బన్ ఎంఈఓలకు బదలాయించాలన్నారు. అర్బన్ ఎంఈఓ పోస్టులను మునిసిపల్ ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలన్నారు. ప్రతి మునిసి పార్టీలో ఒకటి, కార్పొరేషన్ పరిధిలో 2 చొప్పున విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో నాలుగు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యా శాఖలో పురపాలక విభాగాన్ని ఏర్పాటు చేయటం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు. జెడ్పీ టీచర్లకు వర్తింపచేసే ఏపీపీఎస్సీ పరీక్షల వయోపరిమితి మినహాయింపును పురపాలక టీచర్లకు కూడా వర్తింప చేయాలన్నారు.

రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణ..

 ✍️సీఎం దాస్, ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

 తనపై అరెస్టు వారెంట్ జారీ అయిందని ఏపీసీపీఎస్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్ తెలిపారు. తనతోపాటు ఖాజా, గిరీష్, వెంక ట్రావు, ప్రసాద్, పల్నాడు జిల్లా ఏపీటీఎఫ్-1938 అధ్యక్షుడు బెజ్జం సంపత్ కుమార్ పైనా వారెంట్లు జారీ అయినట్టు తెలిపారు. ఈ పరిణా మాలను ఏపీసీపీఎస్ యూఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తుంటే ఏపీలో మాత్రం సీపీఎస్ ఉద్యోగులకు అరెస్టు వారెం ట్లు జారీ చేస్తున్నారన్నారు. ఇవే కేసులను ఎత్తివేస్తూ జగన్ సర్కార్ 2020 జూలైలో జీవో నెంబరు 731ని జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి: టీఎన్ యూఎస్

గత కొన్ని నెలలుగా ఉపాధ్యాయులు ఎదురు చూ స్తున్న బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయ బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ కాకుండా ఆఫ్ లైన్ లో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేసే వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టియన్ యుఎస్) డిమాండ్ చేసింది. వెబ్ కౌన్సెలింగ్కు ఆప్షన్ పెట్టుకోడానికి సర్వర్ పని చేయక రోజుల తరబడి ఉపాధ్యా యులు ఆప్షన్స్ ఇవ్వలేక ఉపాధ్యాయులు ఆందోళన పడ్డారని, అవి సరిగా నమోదుకాక మంచి ప్రాంతాలు దొరికే అవకాశం ఉన్నా కూడా వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యారని, కనుక వెబ్ కౌన్సెలింగ్ విధానం నిలిపివేయాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు, ఆర్ధిక కార్యదర్శి పినాక పాణి, గౌరవాధ్యక్ష్యుడు బెంగుళూరు రమేష్ డిమాండ్ చేశారు.





No comments:

Post a Comment