BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Friday 30 September 2022

AP TETలో 150కి 151 మార్కులు!|5 వేల పోస్టులు కూడా ఇవ్వరా?| Group-1 Notifi...


ఏపీ టెట్లో 150కి 151 మార్కులు

టెట్‌’ ఆశలు ఆవిరి!

కొందరికి నూరుశాతానికి పైగా మార్కులు .. ఆపై దిద్దుబాటు 

ఏదైనా పరీక్ష 150 మార్కులకు రాస్తే ఎన్ని వస్తాయి? గరిష్ఠంగా 150 లేదా అంతకంటే తక్కువ మార్కులు వస్తాయి. అయితే... పాఠశాల విద్యాశాఖ నిర్వ హించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో 150కి 151 150.86, 150.64, 150.26, మార్కులు వచ్చాయి. ఇదేంటి? అని అనుకుంటున్నారా? అధికారులు నిర్వహించిన నార్మలైజేషన్ విధానంతో ఈ పరిస్థితి ఏర్పడింది. టెట్ ఫలితాలను శుక్రవారం వెబ్సైట్లో ఉంచారు. గరిష్ఠం కంటే ఎక్కువ మార్కులు రావడంతో వాటిని చూసి అభ్యర్థులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఇలా ఒక్కరికో ఇద్దరికో కాదు.. దాదాపు 8 మంది ఎస్జీటీ పరీక్ష రాసిన విద్యార్థులకు ఇదే రీతిలో ఫలి తాలు వచ్చాయి. టెట్ పరీక్షను ఈ ఏడాది కంప్యూటర్ ఆధారిత విధానంలో 16 రోజుల పాటు నిర్వహించిన పరీక్షలకు 4,07,329 మంది హాజరయ్యారు. ఇన్ని రోజుల పరీక్షల్లో ఒక రోజు ప్రశ్నపత్రం కఠినంగా.. మరొక రోజు తేలికగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తారు. ఏపీ ఈఏపీసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్ లాంటి వాటిల్లోనూ ఇదే విధానాన్ని పాటిస్తారు. నార్మలైజేషన్ చేసే సమయంలో గరిష్ఠ 150 మార్కుల కంటే ఎక్కువ వచ్చినా వాటిని 150కే పరిమితం చేయాలి. పాఠశాల విద్యాశాఖ మాత్రం ఫలితాల విడుదలలో ఎలాంటి పరిశీలన చేసుకో కుండానే 150కి 151 మార్కులను ఇచ్చేసింది. కఠిన ప్రశ్నపత్రంలోనూ ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు 150కంటే ఎక్కువ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ప్రశ్నపత్రం తేలికగా ఉన్న వారికి ఎక్కువ మార్కులు వస్తే కఠినంగా వచ్చిన వారికి అదనంగా మార్కులు కలుస్తా యని, ఇలాంటి సమయంలో ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులకు మళ్లీ ప్రత్యేకంగా 150 మార్కులను మాత్రమే ఇస్తామని ప్రకటిం మంది చారు. ఎస్జీటీకి పేపర్-1ఏ, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలల్లో 1-5 తరగతుల బోధనకు పేపర్-బీ, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2ఏ, ప్రత్యేక ఉపాధ్యాయులకు పేపర్-2బీ పెట్టారు. ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహించారు.

TET ఆశలు ఆవిరి!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)పై అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంతో ఏకంగా 1,18,474 మంది పరీక్షలకు దూరమయ్యారు. వీరంతా రూ.500 చొప్పున చెల్లించిన దరఖాస్తు రుసుము దాదాపు రూ.6 కోట్లు వృథాగా మారింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అభ్యర్థులు పరీక్షలకు దూరం కాలేదు. 2018 తర్వాత నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెట్‌కు ఏకంగా 5,25,803 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ కేవలం 150 పరీక్ష కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసింది. వీటిలో చాలావరకూ ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉండటంతో ఏపీలో కేంద్రాలు దొరకని వారు పరీక్షలు రాయలేకపోయారు.  

♦️ఐదుగురికి 150 మార్కులు 

ఈ ఏడాది టెట్‌ రాసిన 4,07,329 మందిలో 2,36,535 (58.07ు) మంది అర్హత సాధించారు. వారిలో ఐదుగురికి 150 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనరల్‌ అభ్యర్థులకు 60శాతం, బీసీ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీ్‌సమన్‌ కోటా అభ్యర్థులకు 40శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు. పరీక్షలకు ఎక్కువ సమయం ఇవ్వకపోవడంతో చాలామంది అనర్హులుగా మిగిలిపోయారు. మరోవైపు టెట్‌ ఫలితాల్లో వింతలు చోటుచేసుకున్నాయి. 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా కొందరికి నూరు శాతానికి పైగా మార్కులు రావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన వడ్ల మంజుల 150కి గాను 150.26958 మార్కులు వచ్చాయి. మరో అభ్యర్థికి 150.86, ఇంకొకరికి 15.64 మార్కులు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. సాయంత్రానికి వీటిని సరిదిద్దడంతో ఊపిరి పీల్చుకున్నారు.  

92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APPSC గ్రూప్- 1 (జనరల్ మిటెడ్ రిక్రూట్మెంట్)లో 92 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది.రవాణాశాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహి కల్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని, నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలు!

గ్రూపు-1 పోస్టుల భర్తీకి మాత్రమే మౌఖిక పరీక్షలను పరిమితంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గత నెల 28న జారీచేసిన ఉత్తర్వుల్లో గ్రూపు-1 ఉద్యోగాలతోపాటు లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కూడా ఇంటర్వ్యూలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. తాజా గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల గురించి ప్రస్తావించలేదు.

Watch the below video for more details regarding this....

AP TET 2022 Results| ఏపీ టెట్ ఫలితాలు విడుదల| గతంలో రాసిన టెట్ కన్నా తక్...



𝐀𝐏 𝐓𝐄𝐓 𝐑𝐄𝐒𝐔𝐋𝐓 2022 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃 | ఏపీ టెట్ ఫలితాలు విడుదల

టెట్ లో 58% మందికి అర్హత


AP టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష (AP TET 2022) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన 4,07,329 మంది అభ్యర్థుల మార్కుల వివరాలు

https://aptet.apcfss.in/
or
 https://cse.ap.gov.in/ DSE/ 

వెబ్సైట్లో పొందుపరిచారు. 
SC,ST,BC,PH,EX SERVICEMEN అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07 శాతం మంది టెట్ లో అర్హత సాధించారు. అభ్యర్థులు తమ మార్కుల వివ రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


 » ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో కలవు 

 » సబ్జెక్టుల వారీగా పేపర్ 1 మరియు పేపర్ 2 ఫలితాలు విడుదల 

 » మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకొనే ఆప్షన్ ఎనేబుల్ చేయటం జరిగింది 

AP TET Marks Memo Download Link👇

https://aptet.apcfss.in/CandidateLogin.do


For more details Watch the following Video.....

Thursday 29 September 2022

YSR Cheyutha Payment Status Check 2022| వైఎస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ ...

Cheyutha Payment Status Check 2022- వైఎస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి

Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

Step 2: Scheme దగ్గర YSR Cheyutha అని ఎంచుకోండి.

Step 3: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ ని ఎంటర్ చేయండి

Step 4: UID పక్కనే ఉన్న అంకెలను అదే విధంగా పక్కనే ఉన్న enter captcha బాక్స్ లో టైపు చేయండి . తరువాత GET OTP బటన్ పైన క్లిక్ చేయండి

Step 5: Get otp పైన క్లిక్ చేయాలనే ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి

Step 6: తరువాత కింది విధంగా OTP Sent Successfully అని వస్తుంది . OK పైన క్లిక్ చేయండి

Step 7: తరువాత మీ ఫోన్ కి వచ్చే OTP ని యధావిధిగా OTP లో ఎంటర్ చేసి వెరిఫై OTP పైన క్లిక్ చేయండి

Step 8: కింది విదంగా మెసెజ్ వస్తుంది . OK అని క్లిక్ చేయండి.

Step 9: చివరగా డీటెయిల్స్ అన్ని కింది విధంగా చూపిస్తాయి . Payment Details -> status లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది. Eligible/ Approved అని ఉంటె మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది ఆ తరువాత success గా మారిపోతుంది. స్టేటస్ అప్డేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది.


Note: Status లో ఒకవేళ success కి బదులు fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది. Eligible లేదా Approved అని ఉంటే మీకు ఒకటీ లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది.


Wednesday 28 September 2022

India Post Recruitment 2022: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీ...


POSTAL JOBS జాబ్ నోటిఫికేషన్ విడుదల

India Post Recruitment 2022: దరఖాస్తు విధానం

 1- అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
 2- రిక్రూట్‌మెంట్స్ సెక్షన్‌లో Skilled Artisans నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
3- నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. ప్రింట్ తీసుకోవాలి.
4- అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
5- నోటిఫికేషన్‌లో ఉన్న అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా అప్లికేషన్ ఫామ్ పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 19

విద్యార్హతలు- అభ్యర్థులు 8వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఎంవీ మెకానిక్ పోస్టుకు అప్లై చేసేవారికి హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ట వయస్సు 30 ఏళ్లు.

ఎంపిక విధానం- కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్

వేతనం- ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Senior Manager (JAG), Mail Motor Service, No. 37, Greams Road, Chennai-600 006.

Details of Vacancies in Postal Department

మొత్తం ఖాళీలు 5
ఎంవీ మెకానిక్ (స్కిల్డ్) 2
ఎంవీ ఎలక్ట్రీషియన్ (స్కిల్డ్) 1
పెయింటర్ (స్కిల్డ్) 1
టైర్‌మ్యాన్ (స్కిల్డ్) 1


Saturday 17 September 2022

SSC CGL (Combined Graduate Level)-2022 Notification

SSC CGL-2022:  డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వంలో GROUP - B & C  ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

★ మొత్తం పోస్టులు: 20,000

★ Qualification: Any Degree

★ Salary: from Pay Scale Rs 25,500 to  1,51,100



ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు ఉద్యోగ నియామకాలనుచేపడుతున్నాయి. ఈ జాబితాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కూడా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వంలోనివివిధ శాఖల్లో క్లర్క్ (Clerk) పోస్టులను భర్తీ చేస్తుంది. తాజాగా గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష (CGL Exam) ను నిర్వహించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ మొదటి వారంలో ముగియనుంది.

SSC CGL-2022: తాజాగా గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను నిర్వహించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* Eligibility

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం గ్రాడ్రుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీజీఎల్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

* Selection Process

కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్-2022 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా 200 మార్కులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్- టైర్ 1పరీక్ష ఉంటుంది. టైర్ 1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు, టైర్ 2 పరీక్ష రాయడానికి అర్హులు. టైర్ 1, 2 పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. టైర్ 2లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు టైర్ 3 పరీక్షకు రాయటానికి అర్హత సాధిస్తారు. ఈ టైర్ 3 పరీక్ష పెన్-పేపర్ మోడ్‌లో జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి చివరి దశ పరీక్ష టైర్-4లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగానికి అర్హత సాధించినట్లే.

Application Process

- ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ ssc.nic.inను సందర్శించాలి.

- హోమ్‌పేజీలో, లెటెస్ట్ న్యూస్ సెక్షన్‌ను చెక్ చేసి, సంబంధిత లింక్‌పై క్లిక్ చేయాలి.

- లాగిన్ కోసం తమ వివరాలతో అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోవాలి.

- తరువాత లాగిన్ అయి, దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

- చివరగా దరఖాస్తు రుసుము చెల్లించి, అప్లికేషన్‌ను సబ్మిట్‌ చేయాలి.

 దరఖాస్తు రుసుము

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష కోసం జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఇక రిజర్వ్‌డ్ కేటగిరి అభ్యర్థులైతే దరఖాస్తు సమయంలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


* Required Documents

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష కోసం దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, ఓటరు కార్డు, పాన్ కార్డు, స్కూల్ పాస్ సర్టిఫికేట్లు, మార్కుషీట్లు, గ్రాడ్యుయేషన్ పాస్ సర్టిఫికేటు, మార్కు షీట్లు, కేటగిరీ సర్టిఫికేట్( వర్తిస్తే), పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతాయి.