BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Saturday 29 October 2022

AP Grama Ward సచివాలయంలో సరికొత్త సేవలు|ఇక ఎన్ని సర్టిఫికెట్స్ అయినా తీస...

గ్రామ , వార్డు సచివాలయాల్లో సరికొత్త సేవలు 

ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు

 పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు 

తొలి దరఖాస్తు ఆధారంగానే తదుపరి సర్టిఫికెట్ల జారీ •

 నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి వర్తింపు

 వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ల లింకు పంపేందుకు ఏర్పాట్లు

పాఠశాల స్థాయి నుంచే శిక్షణ • క్రీడలకు , క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం • తిరుపతి వేదికగా చెస్ పోటీలను ప్రారంభించిన మంత్రి రోజా

ఈ ఏడాది బదిలీలు జరిగేనా?

♦️ఆచరణకు నోచని మంత్రి బొత్స ప్రకటన

♦️ఉపాధ్యాయులకు తప్పని ఎదురుచూపులు
 ఉపాధ్యాయుల బదిలీలపై ఉత్కంఠ కొన సాగుతోంది. పదోన్నతులు కల్పించి, ఆగస్టులోనే బదిలీలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించి రెండు నెలలు గడిచినా ఇంతవరకు దీనిపై స్పష్టత లేదు. అసలు ఈ ఏడాది బదిలీలు ఉంటాయా? ఉంటే ఎప్పుడు నిర్వహిస్తారు? అనే దానిపై అధికారులూ చెప్పలేని దుస్థితి. బదిలీలకు సంబంధించిన నిబంధనలు తరచూ మార్పులు చేస్తుండడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడు 8 ఏళ్లు పని చేస్తే తప్పనిసరి బదిలీ ఉండేలా నిబంధన ఉంది. దీన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఐదేళ్ల సర్వీసుగా సవరించారు. ఈ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన తర్వాత 8 ఏళ్ల సర్వీసు నిబంధన ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో మార్పు చేశారు. ఆ మేరకు మార్పులు చేసిన అధికారులు తిరిగి దస్త్రాన్ని పంపించారు. ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన చర్చల్లో సంఘాల నాయకులు కనీసం సర్వీసు జీరో ఉన్నా బదిలీ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆ మేరకు నిబంధనల్లో మార్పులు చేశారు. ఇలా తరచూ మార్పులు, చేర్పులు చేస్తున్నారే తప్ప బదిలీలను మాత్రం నిర్వహించడం లేదు. ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

♦️వేసవి సెలవుల్లో ఏం చేశారు?

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తే బోధనకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. మే, జూన్లో సమయం దొరికినా ఈ ప్రక్రియ చేపట్టలేదు. జులై 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మంత్రి బొత్స ప్రకటించినా ఇంతవరకూ షెడ్యూల్ విడుదల కాలేదు. ఒక వేళ ఇప్పుడు విడుదలైనా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాలు, వెబ్ ఐచ్ఛికాల నమోదు, కౌన్సెలింగ్ నిర్వహణకు 30-40 రోజులు సమయం పడుతుంది. అంటే డిసెంబరు వచ్చేస్తుంది. వేసవి సెలవుల్లో ఏం చేశారని.. 3,4 నెలలు గడిస్తే విద్యా సంవత్సరమే ముగిసిపోతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు..

విద్యార్థుల ప్రవేశాలు తగ్గితేఎయిడెడ్ అనుమతులు రద్దు

ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా విద్యాధికారులు

 ఎయిడెడ్ పాఠశాలల పై ప్రభుత్వం నిబంధనల కత్తి దూస్తోంది. గత రెండేళ్లుగా విద్యార్థుల ప్రవేశాలు తగ్గిన ఎయిడెడ్ పాఠశాలల ఆను మతులను జిల్లా విద్యాధికారులు రద్దు చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాలు పెంచుకోవాలని, తగ్గితే చర్యలు తీసుకుం టామని గతంలో నోటీసులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం పమిడిపాడు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 2020 21 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం ఐదు గురే ఉన్నారని, రెండేళ్లుగా పిల్లల సంఖ్య తగ్గిపోయినందున అనుమతులు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు. 2021 సెప్టెంబరు 30లోపు తర గతికి 10 నుంచి 40 మంది విద్యార్థులకు పెంచుకునేందుకు అవకాశం కల్పించినా యాజమాన్యం విఫలమైందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలోని ఎయిడెడ్ పోస్టులను జిల్లాలోని మరో బడికి సర్దుబాటు చేయాలని సూచిం చారు. రికార్డులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు ఆప్పగించాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య తక్కు వగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలల అనుమతుల రద్దుకు అన్ని జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.

వ్యవస్థపై దాడి..

రాష్ట్రంలో 40మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారంటూ గతంలో 418 పాఠశాలలకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వీటన్నింటికీ అనుమతులు రద్దు చేయబోతున్నారు. కొన్ని జిల్లాల్లో విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి కొందరు కసరత్తు చేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాల లను విలీనం చేసేందుకు గతంలో ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఎయిడెడ్ సిబ్బం దీని ప్రభుత్వానికి అప్పగించడం, లేదంటే ఆస్తులతో సహా విద్యా సంస్థలను అప్పగించేందుకు ఐచ్ఛికాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,988 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా.. వీటిలో 83 సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి ఇచ్చాయి. మరో 753 యాజమాన్యాలు సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాయి. మిగతా 1152 పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నందున 418 అనుమతులను ప్రభుత్వమే రద్దు చేస్తోంది. ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయకుండా క్రమంగా వీటి ఉనికినే కోల్పోయేలా చేస్తోంది. విద్యా ర్ధులు తగ్గిపోయారని ఎయిడెడ్ పాఠశాలల అనుమ తులు రద్దు చేస్తున్న అధికారులు.. ప్రభుత్వ బడులకు మాత్రం దీన్ని అమలు చేయడం లేదని ఎయిడెడ్ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ప్రాధ మిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో చాలా ఫౌండే షన్ బడుల్లో ఐదులోపు విద్యార్థులు మిగిలారని, వీటిని మాత్రం కొనసాగిస్తూ తమ పైనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఏపీజీఎల్ఐ ప్రీమియం శ్లాబ్ రేట్లు మార్పు

 పీఆర్సీ -2022 అనుసరించి ప్రభుత్వ బీమాకు సంబంధించి నిర్బంధ శ్లాబ్రేట్ల గరిష్ట పరిమితిని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ బీమా సంయుక్త సంచాలకులు ఎస్ . లింగమూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు . ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ , ఉపాధ్యాయ , గ్రామ , వార్డు సచివాలయా ల ఉద్యోగులు , మున్సిపల్ , నగరపాలక సంస్థలు , ప్రజా రవాణా ఉద్యోగులకు ప్రభుత్వ బీమాకు అర్హత వయసు 21 సుంచి 57 సంవత్సరాలుగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు . గతంలో అమలు చేసిన గరిష్ట ప్రీమియం పరిధి 20 శాతాన్ని ఈ ఉత్తర్వులు ద్వారా రద్దు చేసి అన్ని పాలసీల గరిష్ట ప్రీమియం ప్రస్తుత మూల వేతనంపై 15 శాతం వరకు పెంచే విధంగా మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు . మూల వేత నంపై 8 శాతం కన్నా పైబడి ప్రీమియం చెల్లించిన ఉద్యో గులు గత మూడు సంవత్సరాల్లో వాడుకున్న మెడికల్ లీవ్ వివరాలు ( ఎస్ఆర్ పత్రాలతో ) డీడీవో ధ్రువీకరించి సివిల్ సర్జన్ లేదా సివిల్ అసిస్టెంట్ సర్జన్ జారీచేసిన గుడ్హెల్త్ సర్టిఫికెట్ను సమర్పించాల్సిందిగా ఆయన కోరారు . గ్రామ , వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రీమియం జమ అయిన తేదీ నుంచి మొదటి పాలసీ జారీ చేయడం జరుగుతుంద న్నారు . అలాగే ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీసు విజయవం తంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారికి గరిష్ట ప్రీమియంపై 15 శాతం వరకు పెంపుదలకు అవకాశం ఉంటుందన్నారు . 57 ఏళ్లు దాటిన తరువాత పంపిన ప్రతిపా దనలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని , అటువంటి మొత్తాలను ఇన్సూరెన్స్ బోనస్ లేకుండా అనధికార మొత్తా లుగా పరిగణించి చందాదారులకు తిరిగి చెల్లిస్తామన్నారు .




No comments:

Post a Comment