ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) 2026 కు సంబంధించి వివిధ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలయింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ APCOB Careers ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కీలక వివరాలు (Key Details)
మొత్తం ఖాళీలు: 338 పోస్టులు.
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ - 295, స్టాఫ్ అసిస్టెంట్ - 43.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 జులై 2026.
దరఖాస్తుకు చివరి తేదీ: 07 ఆగస్టు 2026.
పరీక్ష తేదీ: ఆగస్టు/సెప్టెంబరు 2026 లో ఉండవచ్చు
అర్హతలు (Eligibility Criteria)
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్ మరియు స్థానిక భాష (తెలుగు)పై పట్టు ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది).
స్థానికత: అభ్యర్థి ఏ జిల్లాకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో, ఆ జిల్లాకు చెందిన వారై ఉండాలి
ఎంపిక విధానం & పరీక్షా సరళి (Selection Process)
ఆన్‌లైన్ రాత పరీక్ష (Online Written Exam) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
మొత్తం మార్కులు: 200 మార్కులు (200 ప్రశ్నలు).
సమయం: 120 నిమిషాలు.
నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 (1/4) మార్కు కోత విధిస్తారు.
సబ్జెక్టులు: రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఫైనాన్స్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్
దరఖాస్తు రుసుము (Application Fee)
OC / BC / EWS అభ్యర్థులకు: ₹826.
SC / ST / దివ్యాంగులు / ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు: ₹590.
NATIONAL INSURANCE JOBS 2026| NICL 500 ASSISTANT JOBS| INSURANCE JOBS| NICL RECRUITMENT 2026
ఎన్ఎసీఎల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ఐసీఎ అసిస్టెంట్ పోస్టులుల్) క్లాస్-III కేటగిరీలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు
సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై
18 నుంచి ప్రారంభం కానుంది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ
నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అభ్యర్థులుయి తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ప్రాంతీయ
భాషలోచదవడం, రాయడం, మాట్లాడటంలో
తప్పనిసరిగా నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో
ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం
రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు
ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 18.
లాస్ట్ డేట్: ఆగస్టు 7.
ఫేజ్-1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ తేదీ: ఆగస్టు 27. ఫేజ్-II ఆన్లైన్ ఎగ్జామినేషన్ తేదీ: అక్టోబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్ - ఆన్లైన్ ఎగ్జామినేషన్,
ఫేజ్-II ఆన్లైన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్
టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్
nationalinsurance.nic.co.inను
సందర్శించండి.
ప్రభుత్వ డైట్, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన డీసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైందని డీసెట్ కన్వీనర్, గుంటూరు ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు. డిసెట్
అర్హత సాధించిన ర్యాంకు హోల్డర్లు ఈనెల 15 వరకు తాము ప్రవేశం
కోరుకునే కళాశాలలకు ప్రాధాన్యత క్రమంలో వె ప్షన్లు పెట్టుకోవాలి. 16న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. 19నుంచి 23 వరకు ప్రభుత్వ డైట్లలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనకు
అభ్యర్థులు తమ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో పాటు తమ విద్యార్హతల
ఇతర ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థులకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఆధారంగా అభ్యర్థులు తమకు సీటు వచ్చిన కళాశాలలో చేరాలి. ఈనెల 25నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభ మవుతాయని లింగేశ్వరరెడ్డి తెలిపారు.
అది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు, జమ్ముకశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు
ప్రసూతి సెలవులు రాజ్యాంగబద్ధంగా Maternity మహిళలకు దక్కే హక్కు అని.. దాన్ని ప్రభుత్వం leave ఇచ్చే దానంగా చూడలేమని జమ్ము-కశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వారికి చెల్లించాల్సిన
ప్రసూతి సెలవుల వేతనాన్ని పనిచేయలేదనే ఉత్త
ర్వుల పేరుతో రద్దు చేయలేరని జస్టిస్ రజ్నేష్
ఒస్వాల్ స్పష్టం చేశారు. సెలవుల్లో ఉన్న మహిళా డాక్టర్లకు వేతనాన్ని నిరాకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. వెంటనే వారికి పూర్తి జీతాలను విడుదల చేయాలని ఆదేశించింది.
ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ..
జమ్మూకశ్మీర్ ఆరోగ్యశాఖ 2025 అక్టోబర్ 24న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం అప్పటికి ప్రసూతి సెలవుల్లో ఉన్న మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందికి జీతాలను నియంత్రించాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు ఈ ఉత్తర్వు లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఉపాధ్యాయులకు అవసరమైన ముఖ్యమైన డిపార్ట్‌మెంట్ టెస్టులు – పూర్తి వివరాలు
📍ఉపాధ్యాయుల పదోన్నతులు, ఉన్నత వేతన శ్రేణులు (AAS/24 Years Scale), పరిపాలనా అర్హతల కోసం కొన్ని డిపార్ట్‌మెంట్ టెస్టులు తప్పనిసరిగా పరిగణించబడుతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
━━━━━━━━━━━━━━━
✅ 1. Government Orientation Test (GOT)
📍కోడ్: 88 & 97
🔹 ఎవరికి అవసరం?
* SGT
* LP
* PET
* LPT
* School Assistants (SA)
🔹 ఎందుకు అవసరం?
✔️ SGT, LP, PETలకు 24 Years AAS Scale మంజూరుకు ఉపయోగపడుతుంది.
✔️ SAలకు Headmaster (GHM) పదోన్నతిలో అర్హతగా పరిగణిస్తారు.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 AP Educational Service Rules
📖 RTE Act – 2009
📖 Conduct Rules
📖 CCA Rules
📖 విద్యా పరిపాలన
📖 ప్రభుత్వ ఉత్తర్వులు (GOs)
📖 ఉపాధ్యాయ సేవా నియమాలు
🔹 ప్రత్యేకత:
👉 విద్యాశాఖ పరిపాలనా విధానాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.
━━━━━━━━━━━━━━━
✅ 2. Executive Officers Test (EOT)
📍కోడ్: 141
🔹 ఎవరికి అవసరం?
* SGT
* LP
* PET
* School Assistants (SA)
🔹 ఎందుకు అవసరం?
✔️ 24 Years Scale కోసం ఉపయోగపడుతుంది.
✔️ SA నుండి Headmaster ప్రమోషన్‌కు అత్యంత ముఖ్యమైన అర్హత.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 భారత రాజ్యాంగం
📖 Financial Code
📖 Treasury Code
📖 Budget Rules
📖 Pension Rules
📖 Office Procedures
📖 Accounts & Audit అంశాలు
🔹 ప్రత్యేకత:
👉 ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, పరిపాలన, ఖజానా నియమాలపై అవగాహన కలిగిస్తుంది.
━━━━━━━━━━━━━━━
✅ 3. Headmaster Account Test
🔹 ఎవరికి ఉపయోగపడుతుంది?
✔️ ప్రధానంగా Headmaster స్థాయి పరిపాలనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 AER (Annual Establishment Review)
📖 Leave Rules
📖 TA Rules
📖 LTC Rules
📖 School Accounts నిర్వహణ
📖 Cash Book నిర్వహణ
📖 Stock Registers
📖 Grants Utilization
🔹 ప్రత్యేకత:
👉 పాఠశాల పరిపాలన, ఖాతాల నిర్వహణలో ఉపయోగపడే ప్రాక్టికల్ అవగాహన పెరుగుతుంది.
━━━━━━━━━━━━━━━
✅ 4. Professional Advancement Test (PAT)
🔹 ఎవరికి అవసరం?
✔️ కొన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు ఉన్నత వేతన శ్రేణి (Professional Advancement) కోసం అవసరం.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 బోధనా విధానాలు
📖 విద్యా మానసిక శాస్త్రం
📖 పాఠ్య ప్రణాళిక
📖 విద్యార్థుల మూల్యాంకనం
📖 ఆధునిక బోధనా పద్ధతులు
🔹 ప్రత్యేకత:
👉 ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యం.
━━━━━━━━━━━━━━━
✅ 5. SPL Language Test
📍Paper Code: 37
🔹 ఎవరికి అవసరం?
✔️ ఇంటర్మీడియట్‌లో తెలుగు ద్వితీయ భాషగా లేని SGT, LP, PETలకు.
✔️ School Assistants కు GHM ప్రమోషన్ కోసం అవసరం.
🔹 ఎందుకు అవసరం?
✔️ AAS 24 Years Scale మంజూరుకు అవసరం.
✔️ GHM ప్రమోషన్‌కు అర్హతలో భాగం.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 తెలుగు వ్యాకరణం
📖 పదసంపద
📖 రచనా నైపుణ్యాలు
📖 భాషా అవగాహన
🔹 ప్రత్యేకత:
👉 తెలుగు భాషపై కనీస ప్రావీణ్యం నిర్ధారించడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.
━━━━━━━━━━━━━━━
📍ముఖ్య గమనిక:
✅ ఈ డిపార్ట్‌మెంట్ టెస్టులు సాధారణంగా APPSC ద్వారా నిర్వహించబడతాయి.
✅ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
✅ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ / OMR విధానంలో నిర్వహించే అవకాశం ఉంటుంది.
✅ టెస్టులు పాస్ అయితే భవిష్యత్తులో ప్రమోషన్లు, వేతన శ్రేణులలో ఉపయోగపడతాయి.
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు (Teachers in Service) ముఖ్యమైన అంశాలు
ఈ తీర్పు ద్వారా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
TET అర్హత తప్పనిసరి (TET is Mandatory):
విద్యా హక్కు చట్టం (RTE Act, 2009) ప్రకారం, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా మరియు భవిష్యత్తులో ప్రమోషన్లు పొందాలన్నా తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) లో ఉత్తీర్ణత సాధించాలి.
గడువు పెంపు (Extension of Deadline):
గతంలో ఇచ్చిన తీర్పులో TET సాధించడానికి 2 సంవత్సరాల గడువు (31 ఆగస్టు 2027 వరకు) ఇవ్వబడింది. అయితే ఉపాధ్యాయుల పరిస్థితిని, ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, తన విశేషాధికారం (ఆర్టికల్ 142) ఉపయోగించి ఈ గడువును 3 సంవత్సరాలకు పెంచింది.
కొత్త గడువు తేదీ (New Deadline Date): ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు
31 ఆగస్టు 2028 లోపు తప్పనిసరిగా TET అర్హతను సాధించాలి.
పాత నియామకాలకు మినహాయింపు లేదు (No Retrospective Exemption): RTE చట్టం రాకముందు నియమితులైన తమకు ఈ నిబంధన వర్తించదని ఉపాధ్యాయులు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. సెక్షన్ 23(2) లోని నిబంధనల ప్రకారం, చట్టం అమలులోకి వచ్చే సమయానికి అప్పటికే విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా నిర్ణీత గడువులోగా అర్హతలు సాధించాలన్నదే చట్టం యొక్క ఉద్దేశ్యమని కోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు (Directions to States): ఉపాధ్యాయులకు తగిన అవకాశాలు కల్పించేందుకు వీలుగా, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత అధికారులు ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లు (ఆరు నెలల వ్యవధితో) క్రమం తప్పకుండా TET పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
ఇదే చివరి అవకాశం (No Further Extensions): గడువు పెంపు కోసం భవిష్యత్తులో ఎటువంటి అభ్యర్థనలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చిచెప్పింది. కాబట్టి ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.
కోర్టు వారి ముఖ్యమైన పరిశీలనలు (Court's Key Observations)
పిల్లల విద్యా హక్కుకు పెద్దపీట: కోర్టు ఉపాధ్యాయుల పట్ల సానుభూతి వ్యక్తం చేసినప్పటికీ, ఆర్టికల్ 21A ప్రకారం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం రాజ్యాంగపరమైన ఆవశ్యకత అని పునరుద్ఘాటించింది. RTE అనేది పిల్లల కేంద్రీకృత చట్టం అని, ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం భవిష్యత్తు తరాల పిల్లల విద్యా ప్రయోజనాలను పణంగా పెట్టలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉప-చట్టాలు మాతృక చట్టాన్ని అధిగమించలేవు: NCTE జారీ చేసిన 2010 నాటి నోటిఫికేషన్ ద్వారా తమకు మినహాయింపు ఉందని ఉపాధ్యాయులు చేసిన వాదనకు బదులిస్తూ, ఉప-చట్టాలు (Subordinate legislation) ఎప్పుడూ కూడా పార్లమెంటు చేసిన ప్రధాన చట్టాన్ని (Parent statute) అధిగమించలేవని కోర్టు స్పష్టం చేసింది.
రివ్యూ పరిధి పరిమితం: ఒకసారి ఇచ్చిన తీర్పును కేవలం అసంతృప్తి కారణంగా మళ్ళీ విచారించలేమని (Review is not an appeal in disguise), రికార్డులో స్పష్టమైన తప్పు ఉంటేనే రివ్యూ చేస్తామని కోర్టు స్పష్టం చేస్తూ ప్రధాన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది.
ముగింపు:
సారాంశంలో, RTE చట్టం కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారైనా సరే, 31 ఆగస్టు 2028 లోపు TET ఉత్తీర్ణత సాధించడం ఇప్పుడు న్యాయపరంగా తప్పనిసరి. ఈ గడువును ఇక పొడిగించే అవకాశం లేనందున, ఉపాధ్యాయులు రాబోయే TET పరీక్షలకు సన్నద్ధం కావడం ఒక్కటే వాస్తవిక పరిష్కారం.
కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఈ నెల (27.05.2026) నుంచి దరఖాస్తులు స్వీకరణ
సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా
సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి
ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. గారు
ఒక ప్రకటనలో తెలిపారు.
తూర్పు గోదావరి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు
మినహాయించి మిగతా జిల్లాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక
ప్రాతిపదికన 2026-27 విద్యాసంవత్సరానికి గాను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 16 ప్రిన్సిపాల్
పోస్టులు, 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ) 52 ఫిజికల్
ఎడ్యుకేషన్ టీచర్స్ (పీఈటీ) PETS) పోస్టులు ఉన్నాయని తెలిపారు. జీతం, వయో పరిమితి, విద్యార్హతలు
తదితర వివరాలకు http://kgbvrecruitment.apcfss.in వెబ్ సైట్ సందర్శించగలరు. అర్హత, ఆసక్తి గల
అభ్యర్థులు 27.05.2026 నుండి 05.06.2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి 70750 39990, 79933 29115 నంబర్లను
సంప్రదించగలరు.
ఈ నెల 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ వివరాలు
వెల్లడించిన సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది ఉద్యోగాలకు సమగ్రశిక్ష నోటిఫికేషన్ వెల్లడించింది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన
మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షస్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి, డా.. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలుమినహా మిగతా జిల్లాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు 2026-27 విద్యాసంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టనున్నారు. 16 ప్రిన్సిపాళ్లు, 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీటీ), 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ (సీఆర్టీ) 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈటీ) పోస్టులు ఉన్నాయి. జీతం, వయో పరిమితి, విద్యార్హతలు తదితర వివరాలు http:/kgbvrecruitment.apcfs.in వెబ్ సైట్లో
పొందుపరిచారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి జూన్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి 70750 39990, 79933 29115 నంబర్లను సంప్రదించాలని సమగ్రశిక్ష ఎస్పీడీ
శ్రీనివాసరావు సూచించారు.
ఏపీ మెగా డీఎస్సీ లో భారీ స్కాం? | జగన్ పై లోకేష్ ఫైర్ | పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన | AP DSC 2026
మెగా డిఎస్సినా? దగా డిఎస్సినా?
పేపర్లు లీక్.. డేటా డిలీట్..
మెరిట్ లిస్టు మాయం •
వైసిపి అధినేత వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డిఎస్సినా? దగా డిఎస్సినా? పేపర్లు లీకు, డేటా
డిలీట్ అయ్యాయని, మెరిట్ లిస్టు మాయమైందని, దీనిపై ముఖ్యమంత్రి ఏమి సమాధానం చెబుతారు? అని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ సోమవారం స్పందించారు. వైసిపి హయాంలో ఇచ్చిన డిఎస్ సిని రద్దుచేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నారని తెలిపారు. తీరా పరీక్షల్లో చేసిన నిర్వాకాలు, స్కామ్ |
లతో ఉద్యోగార్థులకు ద్రోహం జరిగిందని పేర్కొన్నారు. విద్యాశాఖలో లీకులతో సాగిన 'డార్క్ ఆపరేషన్'ను ఎందుకు దాచిపెడుతున్నారని
ప్రశ్నించారు. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఆర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను
ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు
తొలగించారో బయటపెట్టాలన్నారు. ఎంపికైన వారికి మాత్రమే నేరుగా మెసేజ్ లు ఎందుకు
పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. రూ.15 లక్షలకు 'స్పోర్ట్స్ కోటా పోస్టుల బేరసారాలాడారని, ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగుపెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఇంటికే
పిలిచి ఒప్పందాలు కుదిర్చారని, రిక్రూట్ మెంటు వేలం పాటలా మార్చేశారని వివరించారు. ఇలా జరిగితే ప్రతిభ ఉన్నవారి
మాటేమిటో సమాధానం చెప్పాలని కోరారు. టెట్ కన్వీనర్ ఉన్న అధికారే డిఎస్సి పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనరు తొలగించి విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ను డిఎస్ కన్వీనర్ పెట్టడం వెనుకు మతలబు ఏమిటన్నారు. దీనికి సంబంధిత శాఖ
మంత్రి బాధ్యత వహించాలని, సిబిఐ దర్యాప్తును కోరాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో
చిత్తశుద్ధి ఉంటే ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
16 వేల మంది టీచర్లకు
జగన్ క్షమాపణ చెప్పాలి
త్వరలో మరో డీఎస్సీ..
ఏడవడానికి సిద్ధంగా ఉండండి
ఎక్స్ జగన్ మంత్రి నారా లోకేష్ ఫైర్
వైసీపీ అధినేత జగన్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. మీరు టె స్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరమని లోకేష్ వ్యాఖ్యానించారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికై
న టీచర్లు అందరికీ జగన్ లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్న మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని మంత్రి నారా లోకేష్ అన్నారు.
KGBV కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల
AP KGBV లలో ప్రిన్సిపాల్, PGTs, CRTs, PETs మొత్తం 299 టీచింగ్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, అర్హతలు, షెడ్యూల్ , నోటిఫికేషన్ పూర్తి వివరాలు
APSS – KGBVs – Filling up of 299 vacant Teaching posts in all
KGBVs – Certain instructions & guidelines – Issued.
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల
▪️మొత్తం పోస్టుల సంఖ్య: 299
పోస్టులు:
▪️ప్రిన్సిపాల్-16
▪️పీజీటీ-98
▪️సీఆర్టీ-133
▪️పీఈటీ–52.
▪️ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ : 27.05.2026 నుండి 05.06.2026 వరకు.
All the District Educational Officers & Ex-officio P.C., SS and Additional
Project Coordinators, SS except East Godavari, Dr. B. R. Ambedkar Konaseema,
West Godavari, Krishna and Guntur in the State are informed that in the ref. 1st
cited, Government has accorded permission for filling up of vacant teaching posts
in all 352 KGBVs on contract basis for the academic year 2026 -27 with view to
provide quality education to girl students studying in the KGBVs to make them as
21st century global citizens.
In this connection a paper notification has been issued from state office on
27-04-2026 for calling Online applications through
http://kgbvrecruitment.apcfss.in
from the eligible woman candidates for filling
up of 299 vacant posts of teaching staff in all the Kasturba Gandhi Balika Vidyalas
(KGBVs) located across the State of AP purely on contract basis for the academic
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్లి జిబిలిటీ టెస్ట్ జూన్ 2026 (యుజిసి నెట్) దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు పొడిగించారు. ఈ నెల 20వ తేదీ
రాత్రి 11.50 గంటలకు దరఖాస్తు గడువు ముగియగా, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ఎ) ప్రకటించింది. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ అవార్డు, విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పిహెచ్డి
ప్రవేశాలకు యుజిసి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూన్ 22 నుంచి 30 వరకు యుజిసి నెట్ పరీక్షలు జరుగనున్నాయి.
UGC NET 2026 జూన్ సెషన్ పరీక్షలు జూన్ 22 నుండి జూన్ 30, 2026 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరుగుతాయి.
పరీక్ష ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు గడువు: మే 23, 2026 (ఉదయం 10:00 వరకు)
ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 23, 2026 (రాత్రి 11:50 వరకు)
కరెక్షన్ విండో: మే 22 నుండి మే 24, 2026
పరీక్ష నగరాల కేటాయింపు ప్రకటన: జూన్ 10, 2026
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: జూన్ 15, 2026 నుంచి అందుబాటులో ఉంటాయి
పరీక్ష తేదీలు: జూన్ 22 నుండి జూన్ 30, 2026
అర్హతలు (Eligibility)
విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి మాస్టర్స్ డిగ్రీ (తెలుగు లేదా తత్సమాన సబ్జెక్టు) పూర్తి చేసి ఉండాలి.
మార్కులు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 55% మార్కులు, SC/ST/OBC/PWD అభ్యర్థులు 50% మార్కులు సాధించి ఉండాలి.
పరీక్ష విధానం (Exam Pattern)
ఈ పరీక్ష మొత్తం 3 గంటల వ్యవధిలో ఎలాంటి బ్రేక్ లేకుండా ఆన్‌లైన్‌లో (CBT) జరుగుతుంది.
పేపర్ - I: 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (100 మార్కులు). ఇది టీచింగ్ మరియు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ (రీజనింగ్, జనరల్ అవేర్నెస్) ఆధారంగా ఉంటుంది.
పేపర్ - II: 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (200 మార్కులు). ఇది అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ (ఉదాహరణకు తెలుగు) మీద ఉంటుంది.