AP Postal Departmental Jobs 2022: పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి నోటిఫికేషన్.. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ తో పాటు ఇతర పోస్టులు..
ఇండియన్ పోస్టల్ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 61, మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్ – 56, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ – 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ టాస్కింగ్ పోస్టులకు 10 వ తరగతి పాస్ అయితే సిరిపోతుంది. మిగిలిన పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారు. పది, ఇంటర్ అర్హతతో పాటు.. సంబంధిత క్రీడల్లో నైపుణ్యం సాధించిన క్రీడాకారులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు అర్హులు. క్రీడా నైపుణ్యం కలిగినట్లు సర్టిఫికెట్స్ ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అనేది అక్టోబర్ 23 నుంచి ప్రారంభం అయ్యాయి. నవంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు అన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 మధ్య వేతనం ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81, 100 మధ్య చెల్లిస్తారు. పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 జీతంగా లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు https://dopsportsrecruitment.in/ ను సందర్శించొచ్చు.
No comments:
Post a Comment