Teacher Eligibility Test: ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్ష అర్హత సాధించలేదో.. వారికి ఒక శుభవార్త. దీని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-Cctet నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా సీటెట్ పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. అయితే దీనికి సంబంధించి ఓ పబ్లిక్ నోటీస్ ను విడుదల చేసింది. ఈ సీటెట్ అనేది 16వ సారి నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి కూడా ఆన్ లైన్ విధానంలో ఈ సీటెట్ పరీక్ష నిర్వహించున్నారు. డిసెంబర్ 2022 లేదా జనవరి 2023 ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేస్తామని పేర్కొంది.
దరఖాస్తుల ప్రక్రియ అనేది అక్టోబర్ 31, 2022 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 24, 2022గా వెబ్ నోటీస్ లో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 25, 2022గా తెలిపారు.
ఈ ఏడాది సీటెట్ ను డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు నిర్వహిస్తారు. పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం cctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ పరీక్ష సీబీఎస్సీ నిర్వహిస్తున్న 16వ పరీక్ష. సీటెట్ (Cctet)లో ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు .. రెండు పేపర్‌లకు అయితే రూ.1200 చెల్లించాలి. ఎస్సీ(SC)/ఎస్టీ(ST)/పీడబ్ల్యూడీ(PWD ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఒక పేపర్‌కు రూ.500 రెండు పేపర్‌ల(Two papers)కు రూ.600 ఉంటుంది.
సీటెట్ వల్ల ఉపయోగాలు..
సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
ఎవరు రాయొచ్చు సీటెట్..
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.
పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
ముఖ్యమైన తేదీలు ఇలా..
దరఖాస్తు ప్రారంభం - అక్టోబర్ 31, 2022
దరఖాస్తుల ముగింపు - నవంబర్ 24, 2022
పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ - నవంబర్ 25, 2022
సీటెట్ పరీక్ష - డిసెంబర్ 2022, జనవరి 2023 .
Teacher Eligibility Test: టెట్ లో అర్హత సాధించలేని వారికి గుడ్ న్యూస్.. వారి కోసం మరో అవకాశం ఇలా..

Watch this video for more information regarding this...
No comments:
Post a Comment