BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Friday 28 October 2022

AP Model Schoolకు మంచి రోజులు| గురుకుల కార్మికులు APCOS పరిధిలోకి|సచివాల...


మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్కు పే ప్రొటెక్షన్

 మోడల్ స్కూల్స్లో 2010 డీఎస్సీ ద్వారా ప్రిన్సిపాల్స్ నియమితులైన ఇన్ సర్వీస్ పీజీటీలకు పే ప్రొటెక్షన్ అమలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ సర్క్యులర్ జారీ చేశారు. ఇన్ సర్వీస్ ప్రిన్సిపాల్స్కి పే ప్రొటెక్షన్ ఇవ్వడంపై మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇతర యాజమాన్యాల నుంచి వచ్చి మోడల్ స్కూల్స్లో చేరిన టీచర్లకు, మోడల్ స్కూల్స్లోనే టీజీటీ నుంచి పీజీటీగా ఎంపికైన టీచర్లకు కూడా పే ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరారు.

డీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు4వ తేదీలోపు ఫీజు చెల్లించాలి

🦋 దేవానందరెడ్డి

 డీఈడీ-2021-23 బ్యాచ్ విద్యార్థులు, గతంలో అనుత్తీర్ణులైన వారు మొదటి సెమిస్టర్ పరీక్షలకు నవంబరు 4వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానం దరెడ్డి తెలిపారు. నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ.150 ఫీజు చెల్లిం చాలని వెల్లడించారు. గత ఆగస్టులో 2020-22 బ్యాచ్కు నిర్వహించిన రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సైతం విడుదల చేసినట్లు తెలిపారు. మొత్తం 2,873 మంది పరీక్షలకు హాజరు కాగా.. 96.50 % మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.ప్రధానోపాధ్యాయుల అకౌంట్ పరీక్షకు సంబంధించి నవంబరు 10లోపు ఫీజు చెల్లించాలని వెల్లడించారు. అపరాధ రుసుము రూ.60తో 14వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

మధ్యాహ్న భోజనం వంట మెటీరియల్ ఖర్చు పెంపు

ప్రైమరీలో ఒక్కో విద్యార్థికి రూ 5.45కి పెంపు అప్పర్ ప్రైమరీలో రూ.8.17

 మధ్యాహ్న భోజన పథకం కింద వంట మెటీరియల్ ఖర్చును పెంచుతూ రాష్ట్ర మధ్యాహ్న భోజనం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ నిధి మీనా సర్క్యులర్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ పథకంలో వంట మెటీరియల్ ఖర్చును 9.6 శాతం అంతకన్నా ఎక్కువ మేర పెంచాలన్న సూచనలతో తాజా సర్క్యులర్ ఇచ్చారు. వంట మెటీరియల్ ఖర్చు కింద ప్రైమరీలో ఒక్కో విద్యార్థిపై ప్రస్తుతం రూ.4.97 ఇస్తుండగా.. దానిని రూ.5.45కు పెంచారు. అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రూ.7.45కు బదులుగా రూ.8.17 చొప్పున అందించనున్నారు.

ఈఏపీసెట్ రెండో విడతలో 11వేల సీట్లు భర్తీ

ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ రెండో విడత కౌన్సె లింగ్లో 11,408 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 19,959 మంది కళాశాలలు, కోర్సులను మార్పు చేసుకున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటా యింపు వివరాలను శుక్రవారం కన్వీనర్ నాగరాణి విడుదల చేశారు. మొదటి, రెండో విడత కలిపి మొత్తం 82.2 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కలిపి కన్వీనర్ కోటాలో 1,12,696 సీట్లు ఉండగా, ఇందులో 92,661 సీట్లు నిండాయి. క్రీడల కోటాకు సంబం ధించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున 491 మందికి సీట్ల కేటా యింపు పూర్తి చేయలేదు. ఈఏపీసెట్ లో 1,73,572 మంది అర్హత సాధిం చగా, కౌన్సెలింగ్కు 1,04,806 మంది రిజిష్టర్ చేసుకున్నారు.

గురుకులాల్లోని వంట కార్మికులు ఆప్కాస్ పరిధిలోకి

 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచే స్తున్న 500 మంది వంట మనుషులు, కార్మికులను (కుకింగ్ అండ్ క్యాటరింగ్) ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సుడ్ సర్వీసెస్ (ఆప్కాస్) పరిధిలోకి తీసుకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 1100 మంది పనిచేస్తుండగా గతేడాది డిసెంబర్ 600 మందిని ఆప్కాస్ పరిధిలోకి తీసుకున్నారు. అప్పట్లో ఇది వివాదాస్పదమైంది. మంజూరు కానీ పోస్టుల్లో కార్మికుల్ని తీసుకోవడం కుద రదని ఆప్కాస్ ఎండీ లిఖితపూర్వకంగా లేఖ రాశారు. అయినా 600 మందిని ఆప్కాస్ లోకి తీసుకుని మిగతా వారిని వివిధ కారణాలు చూపి పక్కనపెట్టారు. తాజాగా మిగిలిన వారిని అందులోకి తీసుకున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి వీరికి ఆప్కాస్ ద్వారానే వేతనాలు చెల్లింపు ఉంటుందని తెలిపారు.

No comments:

Post a Comment