PM Kisan 12th Installment Amount Released| Check Now
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM KISAN Scheme) సంబంధించిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేశారు.
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి
Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి.
రైతులు తమ ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి.
రైతుల అకౌంట్‌లో 12వ ఇన్‌స్టాల్‌మెంట్ జమ అయిందో లేదో తెలుస్తుంది.
తాజాగా విడుదల చేసిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌తో మూడేళ్లకు సంబంధించిన వాయిదాలు వచ్చినట్టే. అంటే పీఎం కిసాన్ పథకానికి మూడేళ్లు పూర్తయిందని అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఓసారి రూ.2,000 చొప్పున ఏడాదికి రూ.6,000 రైతుల అకౌంట్‌లో జమ చేస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM KISAN Scheme) సంబంధించిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదే వేదికపై నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని రైతుల అకౌంట్లలో ఒకే ఒక్క క్లిక్‌తో జమ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా 11 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రూ.2 లక్షల కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.16,000 కోట్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.2.16 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయడం విశేషం
Watch this video for more information.....
No comments:
Post a Comment