కేజీబీవీ కాంట్రాక్టు టీచర్లకు కనీస పేస్కేల్
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
6 వారాల్లో బకాయిలతో సహా చెల్లించాలని స్పష్టీకరణ
కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాం ట్రాక్టు టీచర్లకు కూడా కనీస వేతన స్కేల్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2022 సవరించిన పే స్కేళ్ల ప్రకారం పిటిషనర్లకు కనీస వేతన స్కేల్ను బకాయిలతో సహా ఆరు వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కేజీబీవీ టీచర్ల బదిలీలు జరిగిపో వడం, కొత్త పోస్టుల్లో చేరిపోవడం జరిగినం దున వారిని అక్కడి నుంచి కదల్చడం. సరికాదంది. బదిలీలపై కొందరే కోర్టుకొచ్చా రని, వారి బదిలీలపై విధించిన స్టే యథాత థంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. పిటిషనర్లు ప్రస్తుతం ఉన్న చోటనే కొనసాగు తారని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. కనీస వేతన పేస్కేల్ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని, బదిలీల విషయం లోనూ జోక్యం చేసుకోవాలని పలువురు కేజీబీవీల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ మన్మథ రావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. రెగ్యులర్ టీచర్లు, పిటి షనర్ల విధులు ఒకటే అయినప్పటికీ, వేత నాల్లో ఎంతో తేడా ఉందని తెలిపారు. కనీస వేతనం చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘు వీర్ వాదనలు వినిపిస్తూ.. కాంట్రాక్టు ఉద్యో గులు కనీస వేతనానికి అర్హులు కారని తెలి పారు. పిటిషనర్లు సొసైటీ ద్వారా ఏడాది కాం ట్రాక్ట్ నియమితులయ్యారని, వారికి గౌర వ వేతనం చెల్లిస్తున్నామని అన్నారు. ఇరుప క్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కాం ట్రాక్టు టీచర్లకు కనీస వేతన స్కేల్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
💥.ఏపీ టెట్లో 150కి 151 మార్కులు!
పాఠశాల విద్యాశాఖ నిర్వ హించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో 150కి 151 150.86, 150.64, 150.26, మార్కులు వచ్చాయి. ఇదేంటి? అని అనుకుంటున్నారా? అధికారులు నిర్వహించిన నార్మలైజేషన్ విధానంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
💥.టెట్’ ఆశలు ఆవిరి!
కొందరికి నూరుశాతానికి పైగా మార్కులు .. ఆపై దిద్దుబాటు
పూర్తి వివరణ వార్త ఒకే క్లిక్ లో కింది లింకు లో చూడవచ్చు
💥.మండలానికిద్దరు ఎంఈవోలపై 20వ తేదీ వరకు ముందుకెళ్లొద్దు
రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విచారణ అక్టోబరు 20కి వాయిదా
💥.మినిమం టైం స్కేల్ ఇవ్వలేం
సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై తేల్చేసిన ప్రభుత్వం
💥.వలంటీర్ల సేవలకు మరో ఏడాది పొడిగింపు
గ్రామ, వార్డ్ సచివాలయాలల్లో పనిచేస్తున్న 2.60 లక్షల వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ, వార్డ్ సచివాలయాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
💥.బడికెళ్లే బాలలు తగ్గుతున్నారు
దేశవ్యాప్తంగా స్కూళ్లలో చేరికలపై జనాభా తగ్గుదల ప్రభావం
ఎన్సీఈఆర్టీ నివేదికలో వెల్లడి
2011 నుంచి పడిపోతున్నఒకటో తరగతి చేరికలు
💥.విదేశీ విద్యార్థులకు 25 శాతం సీట్లు
ఉన్నత విద్యాసంస్థల్లో సూపర్ న్యూమరరీ కోటా కింద ఇచ్చుకోవచ్చు
ప్రవేశాల మార్గదర్శకాలను జారీ చేసిన యూజీసీ
💥.గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ ముఖఆధారిత హాజరు
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ శనివారం నుంచి ముఖ ఆధారిత హాజరు నమోదు చేయను న్నారు.
💥.92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఏపీపీఎస్సీ గ్రూప్- 1 (జనరల్ మిటెడ్ రిక్రూట్మెంట్)లో 92 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
💥.ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణలో ఇష్టారాజ్యం
అమరావతి: ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణ వ్యవహారం గందరగోళంగా మారింది. కళాశాలల రెన్యువల్ను నిలిపివేసిన అధికారే హడావుడిగా అర్ధరాత్రి మళ్లీ కొన్నింటి అనుమతు లను పునరుద్ధరించాలని వర్సిటీలపై ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశమైంది.
💥.గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలు!
అమరావతి: గ్రూపు-1 పోస్టుల భర్తీకి మాత్రమే మౌఖిక పరీక్షలను పరిమితంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు
💥.పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ
ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2023 మార్చి 29వ తేదీన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాంల ముగియనుండటంతో ఓటర్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకటన విడుదలైంది.
💥.పాఠశాల విద్యాశాఖ సలహాదారు రాజీనామా
పాఠశాల విద్యాశాఖలో మౌళి కసదుపాయలకల్పనకు సలహాదారుగా ఉన్న ఎ.మురళీతన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు సిఎం జగన్కు లేఖ రాశారు.
💥.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతకే విద్యాంజలి 2.0
ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత గల విద్యని అందించడానికి విద్యాంజలి 2.0, స్వచ్ఛంద సేవల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టామని, దీన్ని జయప్రదం చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు.
Watch this video for more information regarding this...
No comments:
Post a Comment