BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Tuesday 1 November 2022

త్వరలో Police ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్| ASO పోస్టులకు దరఖాస్తులు| FA-1...



అంగన్వాడీల్లో సూపర్వైజర్ల భర్తీ

♦️తాత్కాలిక నియామకాలు షురూ.. సీనియర్ అంగన్వాడీలకు చాన్స్

♦️అదనంగా 5 వేల అలవెన్సు.. రెగ్యులర్ నియామకాలపై కోర్టులో కేసు


రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో గ్రేడ్-1, గ్రేడ్-2, కాంట్రాక్టు సూపర్వైజర్ పోస్టులను తాత్కాలిక విధానంలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికిగాను అర్హత ఉన్న అంగన్వాడీ సీనియర్ కార్యకర్తలను తాత్కాలిక సూపర్ వైజర్లుగా ఆ పోస్టుల్లో నియమించాలని నిర్ణ యించింది. ఇలా నియమితులైన సూపర్వైజర్లకు వారికి ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనంతోపాటు నెలకు మరో రూ.5 వేలు అలవెన్సుగా ఇవ్వనున్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం మెమో జారీ చేశారు. రాష్ట్రంలో 619 గ్రేడ్-2 అంగన్వాడీ సూపర్ వైజర్లు, 66 గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మెమోలో పేర్కొ న్నారు. ఈ నియామకాల కోసం అర్హులైన సీనియర్ అంగన్వాడీ కార్యకర్తలను సీడీపీవోలే గుర్తించాలని పేర్కొన్నారు. సీనియారిటీ, విద్యార్హత, వయసు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మెమోలో స్పష్టం చేశారు. విలీ నమైన అంగన్వాడీల్లో సీనియర్ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని ఆదే శించారు. రెగ్యులర్ విధానంలో పోస్టులు భర్తీ అయ్యే వరకు ఈ తాత్కాలిక విధానం కొనసాగుతుందని తెలిపారు.


సీపీఎస్ ఉద్యోగులపై కేసుల ఉపసంహరణ

 అరెస్టు వారెంట్ జారీ అయిన ఏపీ సీపీఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఏపీ సీపీ ఎస్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎస్ యూస్) అధ్యక్షుడు దాస్ తెలిపారు. సీపీఎస్ ను రద్దు చేసి, పాత పింఛనును అమలు చేయాలని ఏపీసీపీఎస్ యూఎస్ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ లో 2018 అక్టోబరు 2న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీన్ని భగ్నం చేసిన పోలీసులు 26 మందిపై సత్యనారాయణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారించిన కోర్టు 19 మందిపై కేసులను కొట్టివేయగా... మిగిలిన ఏడు గురిలో ఒకరు చనిపోగా ఆరుగురు మిగిలారు. ఈ కేసులో అరెస్టు వారెం ట్లు జారీ కాగా... ప్రభుత్వం ఇప్పుడు కేసులు వెనక్కి తీసుకుందని తెలి పారు. వీటితోపాటు ఈ ఏడాది సెప్టెంబరు 1న సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.


అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల పోస్టులకు దరఖాస్తులు

 ఏలూరు జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఈవో , ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు కో - ఆర్డినేటర్ గంగాభవాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు . అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ , అసిస్టెంట్ ఐఈ కో - ఆర్డినేటర్ , అసిస్టెంట్ ఏఎంవో ( ఉర్దూ ) పోస్టుల భర్తీకి స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 8 వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తులను ఏలూరు జిల్లా ప్రాజెక్టు కార్యాలయానికి చేరేలా పంపించాలన్నారు . దరఖాస్తు నియమావళి , వివరాలను డీఈవోఏలూరు . ఓఆర్డీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు . వివరాలకు 99497 26891 నంబరులో సంప్రదించాలని కోరారు ..

క్లాస్ రూమ్ బేస్డ్  అసెస్మెంట్ - సీబీఏ CBA

తరగతి ఆధారిత మూల్యాంకనం ( క్లాస్ రూమ్ బేస్డ్  అసెస్మెంట్ - సీబీఏ )పేరుతో అమలు చేయనున్న ఈ పరీక్ష విధానం నేటి నుంచి పాఠశాలల్లో ప్రారంభం

5 వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( ఎస్సీఈఆర్టీ ) ఆధ్వర్యంలో జరుగుతాయి  . అయితే 9 , 10 తరగతులకు మాత్రం ' ఎఫ్ఎ , ఎస్ఏ ' పద్ధతుల్లోనే పరీక్షలు ఉంటాయి.
క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ విధానంలో జవాబు పత్రాల స్థానంలో ఓఎంఆర్ షీట్లు ఇస్తారు . ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు . అందులో 15 బిట్లు , 5 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి . జవాబులను బహుళైచ్ఛిక విధానంలో ( ఏ బీ సీ డీ ) గుర్తించాల్సి ఉంటుంది . మరో ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది . అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎంఆర్ షీట్ ఉంటుంది . మొదటి రోజు పరీక్ష పూర్తవగానే ఆ పత్రాన్ని ఉపాధ్యాయుడికి ఇచ్చేయాలి . మరుసటి రోజు మరో సబ్జెక్టు పరీక్ష ప్రారంభం కాగానే మళ్లీ అదే ఓఎంఆర్ షీట్ సదరు విద్యార్థులకు ఇస్తారు . అప్పుడు ఆ సబ్జెక్టుకు సంబంధించిన కాలమ్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది . ప్రశ్నాపత్రంలోని బహుళైచ్చిక విధానం , ఖాళీలు పూరించడం , చిన్న జవాబులు రాసే ప్రశ్నలు ఉంటాయి .


ప్రశ్నలన్నీ కూడా విద్యార్థిని సమగ్రంగా అంచనా వేసే విధంగా ఎంయూఏ ( మెకానికల్ అండర్ స్టాండింగ్ అప్లికేషన్ ) విధానంలో ఉంటాయి .

ఎఫ్ఎ , ఎస్ఏ స్థానంలోనే .. సీఆర్బీఏ పరీక్ష ఇప్పటివరకు జరుగుతున్న కొన్ని ఎఫ్ఎ , ఎస్ఏల స్థానంలోనే ఉంటాయి . 1-8 తరగతుల వారికి ఎఫ్ఎ 1 , 3 ఎస్ఏ -2 కు బదులు మూడు పరీక్షలుంటాయి . ఎఫ్ఎ -2 , 4 లు ఎస్ఏ -1 లు పాత విధానంలోనే నిర్వహిస్తారు . 9 , 10 తరగతి వారికి ఎఫ్ఎలు నాలుగు , ఎస్ఏలు 2 యధావిధిగా జరుగుతాయి .

CBA Exam COMPLETE INFORMATION

👉 CBA పరీక్షల్లో 1-3తరగతులకు , 4-8 తరగతులకు పరీక్ష విధానం వేరుగా ఉంటుంది.
👉 OMR  ను BLUE/BLACK 🖊️పెన్ను తో  మాత్రమే బబుల్ చేయాలి. 
👉 1,2,3 తరగతుల పిల్లలు సమాధానాలను వారి ప్రశ్నపత్రంలోనే "☑️టిక్ " చేసి గుర్తించాలి, తదుపరి 1,2,3 తరగతులను భోదించే ఆ టీచర్ ముందుగా పిల్లల ప్రశ్నపత్ర0లోని ప్రశ్నలను చదివి వినిపించాలి.తదుపరి విద్యార్థి "☑️టిక్ " సమాధానాలను చూసి OMR షీట్ లో ఆ టీచర్ బబుల్ చేయాలి. 
👉 4 నుండి 8 తరగతుల పిల్లలు ప్రశ్నపత్రంలో సరైన సమాధానం ☑️ చేసి సమాధానం వ్రాయాలి. తదుపరి ఆ విద్యార్ధి మాత్రమే OMR షీట్ లో బబుల్ చేయాలి. 
👉 రోజువారీ పరీక్ష అనంతరం (1 to 8 class) ప్రశ్నకు విద్యార్ధి సమాధానం రాయక పోతే, ఉపాధ్యాయుడే OMR లో ఆ ప్రశ్న  వద్ద E కి బబుల్ చేయాలి. 
👉పరీక్ష నిర్వహణకు ముందే ప్రతి ఒక్క విద్యార్థి ఓఎంఆర్ షీట్  లో ఉన్న వివరాలు   ఒకసారి ఉపాధ్యాయులు ధ్రువీకరించుకొనవలెను.  తరువాతే మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.
👉 ఏదేని  OMR షీట్ పాడయితే, BUFFER OMR షీట్  లు MEO ఆఫీస్ వారు అందజేస్తారు. 
👉 వాటి యందు టీచర్ MANNUAL గా విద్యార్ధి వివరాలు వ్రాయాలి. ఆ తదుపరి బబుల్ చేయాలి.
👉ప్రతిరోజు పరీక్ష అనంతరము తిరిగి OMR, ప్రశ్నాపత్రములు తీసుకోవలెను.
 👉విద్యార్థి రాసినటువంటి ప్రశ్నాపత్రములను పరీక్ష నిర్వహించిన పిదప ఉపాధ్యాయులు పాఠశాలలో భద్రపరచుకొనవలెను వాటిని govt వారు ఇచ్చిన సమాధానాలు ఆధారంగామూల్యాంకనం చేయాలి.
👉 ప్రతి రోజు నిర్వహించే సబ్జెక్టు సంభందించిన భాగం లో మాత్రమే bubbling చేసేటట్లు సూచనలు ఇవ్వాలి.ఎందుకనగా మొదటగా ఇంగ్లీష్ సబ్జెక్టు bubbling ఇచ్చారు. కానీ మొదటి పరీక్ష తెలుగు ఉన్నది.
👉 ఒకే OMR  sheet లో అన్ని సబ్జెక్టులు (ప్రైమరీ 4 సబ్జెక్ట్స్ )కలసి ఉన్నవి.ప్రతి రోజూ పరీక్ష అనంతరం వాటిని జాగ్రత్త గా ఉంచాలి.మరుసటి రోజు కూడా వాటినే ఉపయోగించాలి.
👉 విద్యార్థులు అన్ని పరీక్షలు ఆబ్సెంట్ అయితే ఓఎంఆర్ షీట్ పంపించవలసిన అవసరం లేదు.
👉 విద్యార్థి ఒక పరీక్ష మాత్రమే  రాసినా కూడా PRESENT గా భావించి అతని యొక్క ఓఎంఆర్ షీట్ పంపించవలెను.
👉మన పాఠశాలలో పేర్లు తొలగించబడిన విద్యార్థులు యొక్క OMR sheets పంపించనవసరం లేదు.
👉కొత్తగా చేరిన విద్యార్థులకు బఫర్ OMR sheets ఉపయోగించాలి.వారి వివరాలు అందులో రాయాలి
👉ఎట్టి పరిస్థితుల్లో మాస్ కాపీ చేయించ కూడదు. విద్యార్థులు రాసినటువంటి సమాధానం మాత్రమే బబ్లింగ్ చేయించేటట్లు చూడవలెను.
👉 ప్రతి తరగతికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు ఒక ప్యాకెట్ లో భద్రపరిచి వాటిపైన అటెండెన్స్ సీట్ ఉంచవలెను.


No comments:

Post a Comment