BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Tuesday 15 November 2022

CPS రద్దు చేయాలని భారీ నిరసన|Byjus వీడియోలను తెలుగులోకూడా చూసుకోవచ్చు|MB...

పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం
18 లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికి ఆదేశం
ఈ పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేసి ల్యాబ్లు , స్మార్ట్ క్లాస్ రూమ్లు , లైబ్ర రీలు , క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలు  కల్పించేందుకు శ్రీకారం

🍁గ్రామీణ ప్రాంతాల్లోని బడులకు 60 శాతం , పట్టణాల్లో పాఠశాలలకు 70 శాతం మార్కులు వస్తే ఈ పథకానికి అర్హత సాధిస్తాయి
💥తొలి దశ ( స్టెప్ -1 ) లో పాఠశాలలను రిజిస్ట్రేషన్ చేయాలి . రెండో దశలో పరిశీలన ఉంటుంది .

 ప్రధానోపాధ్యా యుడి లాగిన్ పీఎం శ్రీ పోర్టల్కు వెళ్లిన వెంటనే ఫోన్ నెంబరుకు ఓటీపీ వస్తుంది . దాని ద్వారా లాగిన్ అయ్యాక అందులో పేర్కొన్న 46 అంశాలను పూర్తి చేయాలి . ఉపాధ్యాయులు , విద్యార్థులు సరైన నిష్పత్తిలో ఉన్నారా ? లేదా ?, ఆట స్థలం ఉందా ?, వంట శాలలు , మరుగుదొడ్లు ఉన్నాయా ? ఏటా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేస్తున్నారా ? లేదా ? తది తర అంశాలు అందులో ఉన్నాయి . ఆ ప్రక్రియ తరువాత కేంద్ర విద్యాశాఖ ఆయా పాఠశాలలకు మార్కులు కేటాయిస్తుంది . ప్రాథమికంగా గుర్తించిన పాఠశాలల్లో ... మార్కుల ఆధారంగా ఎంపికైన పాఠశాలలకు 5 ఏళ్ల వరకు ఆర్థిక , సాంకేతిక సహకారం అందుతుంది . డిజిటల్ పద్ధతిలో బోధన , ప్రయోగశాలలు , ఇతరత్రా సౌకర్యాలు కల్పి స్తారు . ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు . హరిత పాఠశాలలుగా తీర్చిదిద్ది నీటి సంరక్షణ , వ్యర్థాల రీసైక్లింగ్ తదితర అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదునివ్వనున్నారు . సౌకర్యాలు సమకూరుతాయి ఈ పథకం ద్వారా ప్రభుత్వ బడుల్లో కార్పొరేటు తరహాలో సౌకర్యాలు సమ కూరుతాయి . వసతులు , మార్కుల ఆధారంగా పాఠశాలల తుది ఎంపిక ఉంటుంది . నవంబర్ 18 లోగా రిజిస్ట్రే షన్లు పూర్తి చేసి , పూర్తి వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు పంపేలా చర్యలు తీసుకుంటున్నారు

జీతాల బిల్లుకు సర్వీసు సర్టిఫికెట్లు జత చేయాలి

  25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరూ సర్వీసు సర్టిఫికెట్లు జీతాల బిల్లుకు జత చేయాలని ఖజానా శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది . తమ ఎస్ఆర్ను ఏజీతో వెరిఫై చేయించుకోవాల్సి ఉన్నందున డీడీవోలందరూ తమ పరిధిలో 25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల వివరాలను తెలుపుతూ సర్టిఫికెట్లను నవంబర్ జీతాల బిల్లులకు జతపరచాలని పేర్కొంది .

పాఠశాల విద్య నియంత్రణ , పర్యవే క్షణ కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ రామలింగేశ్వరరావు
పాఠశాల కమిషన్ ఛైర్పర్సన్ గా జస్టిస్ రామలింగేశ్వరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఈ పద విలో ఆయన మూడేళ్లు కొనసాగుతారు .

Watch this video for more information regarding this...


No comments:

Post a Comment