BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Saturday 12 November 2022

Jagananna ku chepukundam| CBSE Pattern Exams for 10th Class| PM SHRI Sch...


2025 నుంచి CBSE ప్యాట్రన్లో టెన్త్ పరీక్షలు

 ♦️ఈ ఏడాది 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టినవిద్యాశాఖ

♦️ఈ విద్యార్థులు 2025 నాటికి సీబీఎస్ఈ తొలి బ్యాచ్

♦️అప్పటినుంచి ఏటా ఇదే విధానం

 ♦️సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న స్కూళ్లకు ఆ బోర్డు ద్వారా పరీక్షలు

♦️మిగిలిన విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు ద్వారా అదే ప్యాట్రన్‌లో..

♦️అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు

♦️సీసీఈ విధానం టెన్త్‌కు అమలయ్యేలా ఏర్పాట్లు

రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరం నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి. ఆ విద్యాసంవత్సరం నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విధానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

ఈ విద్యాసంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ తరహాలో పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ద్విభాషా (బైలింగ్యువల్‌) విధానంలో ముద్రించి ఇచ్చారు. ఈ విద్యార్థులు 2025లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను రాయనున్నారు. వీటిని సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లో నిర్వహించనున్నారు.

ఆ తరువాత నుంచి వచ్చే బ్యాచ్‌ల విద్యార్థులు సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లోనే అభ్యసనం సాగించనున్నందున వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2022-23, 2023-24 విద్యాసంవత్సరపు విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి. ఆతరువాత నుంచి పూర్తిగా సీబీఎస్‌ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి.
 

♦️టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అంతర్గత మార్కులు తప్పనిసరి
ప్రస్తుతం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్‌ పరీక్షలను.. అంతర్గత మార్కులు 20 కలపకుండా నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. సీబీఎస్‌ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్, కంటిన్యూ ఇవాల్యుయేషన్‌ - సీసీఈ) విధానం ప్రకారం గతంలో ఎస్సెస్సీ పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండేవి.

అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు, పబ్లిక్‌ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గతంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల నుంచి అంతర్గత మార్కులను తొలగించింది. పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తోంది.సీబీఎస్‌ఈ విధానాన్ని అనుసరించనున్నందున 2025 నుంచి జరిగే టెన్త్‌ పరీక్షల్లో ఎస్సెస్సీ బోర్డు కూడా ఆ తరహాలోనే అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2022-23)లో కూడా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయనున్నారు.

♦️తొలివిడతగా 1,092 స్కూళ్లకు రానున్న సీబీఎస్‌ఈ గుర్తింపు

రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ హైస్కూళ్లకు సీబీఎస్‌ఈ గుర్తింపునకోసం విద్యాశాఖ ఇప్పటికే ఆ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. సీబీఎస్‌ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1,092 స్కూళ్లకు తొలివిడతగా ఈ గుర్తింపు రానుంది. ఈ స్కూళ్ల విద్యార్థులకు సీబీఎస్‌ఈ విధానాలను అనుసరించి పరీక్షలు ఉంటాయి.నేరుగా ఆ బోర్డే ఈ స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు పెడుతుంది. సీబీఎస్‌ఈ గుర్తింపులేకున్నా దాని సిలబస్, ప్యాట్రన్‌ను మిగిలిన స్కూళ్లలో అనుసరించనున్నందున ఆ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులకు మాత్రం ఎస్సెస్సీ బోర్డు ద్వారా.. సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లోనే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు.


పీఎంశ్రీలో 1096 పాఠశాలలు

♦️ఎంపికైన వాటికి కేంద్ర సహకారం

🌻ఒంగోలు నగరం, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్య (హై క్వాలిటీ ఎడ్యుకేషన్) అందించేందుకు కేంద్రం కొత్తగా పీఎం శ్రీ పథకం ప్రవేశపెట్టింది.
 దీనికింద జిల్లాలో 1096 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. యూడైస్‌ 2021-22 విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని వీటి ఎంపిక జరిగింది. జిల్లాస్థాయిలో ఈ పథకానికి నోడల్‌ అధికారిగా డీఈవో వ్యవహరిస్తారు.

♦️ఇవీ ప్రయోజనాలు👇👇
: పీఎంశ్రీ కింద ఎంపిక చేసిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయిస్తుంది. డిజిటల్‌ పద్ధతిలో బోధన, ప్రయోగశాలలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు. ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తారు. అయిదేళ్ల వరకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందుతుంది. హెచ్‌ఎంలు తక్షణం చేయాల్సిన పనులపై శనివారం జిల్లా విద్యాశాఖాధికారులకు వెబ్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. తొలిదశ( స్టెప్‌-1)లో పాఠశాలలను రిజిస్ట్రేషన్‌ చేయాలి. రెండో దశలో పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ప్రధానోపాధ్యాయుని లాగిన్‌లో పీఎం శ్రీ పోర్టల్‌ను నమోదు చేసిన వెంటనే ఫోన్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్‌ అయిన తరువాత అందులో పేర్కొన్న 42 అంశాలను పూర్తిచేయాలి. వీటితోపాటు హెచ్‌ఎం, పంచాయతీ కార్యదర్శి విద్యార్హత పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. తరువాత కేంద్ర విద్యాశాఖ ఆయా పాఠశాలలకు మార్కులు వేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని బడులకు 60 శాతం, పట్టణాల్లో ఉన్నవాటికి 70 శాతం మార్కులు వస్తే ఈ పథకానికి అర్హత పొందుతాయి. రిజస్ట్రేషన్‌ ప్రక్రియను ఈనెల 18 లోపు పూర్తిచేయాలని ఉన్నతాధికారులు అదేశించారు.

♦️కార్పొరేట్‌ తరహాలో విద్య

ఈ పథకం ద్వారా కొన్ని పాఠశాలల్లో కార్పొరేట్‌ తరహాలో అన్ని సౌకర్యాలతో విద్య అందుబాటులోకి వస్తుంది. యూడైస్‌ ప్రకారం 1086 పాఠశాలల ఎంపిక జరిగింది. వాటిలో ఎన్నింటిలో పథకం అమలు జరుగుతుందనేది త్వరలో తెలుస్తుంది.

▪️- డీఈవో బి.విజయభాస్కర్‌



Watch this video for more information regarding this...



No comments:

Post a Comment