BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Saturday 9 December 2023

AP DSC 2023 అంటూ ఊధరకొట్టి ఊసే లేకుండా చేశారు..| ఎన్నికలకు ముందు Group-1...

AP DSC 2023 అంటూ ఊధరకొట్టి ఊసే లేకుండా చేశారు..| ఎన్నికలకు ముందు Group-1,2 నోటిఫికేషన్లో డ్రామా



ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రూప్ 1&2 నోటిఫికేషన్‌‌ల పేరుతో రాష్ర్టంలో మరొ కొత్త మోసానికి తెరలేపిన జగనన్న.... చివరకు ఉద్యోగాల భర్తీని కూడా రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటూ ఇష్టానుసారంగా నోటిఫికేషన్లు జారీచేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు... ఎప్పుడో 2021లో జాబ్ క్యాలెండర్ కింద ప్రకటించిన గ్రూపు-2 నోటిఫికేషన్ ను మొన్న విడుదల చేశారు. కొన్నినెలల కిందట ప్రకటించిన గ్రూపు-1 నోటిఫికేషన్ ను నిన్న జారీచేశారు.. మొన్నటికి మొన్న అదిగో డిఎస్సి... ఇదిగో డిఎస్సి... అంటూ ఊధరకొట్టి నిరుద్యోగులలో ఆశలు రేకెత్తించి చివరికి ఆ ఊసే లేకుండా చేశారు.. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు కాకా మరేమిటి జగన్మోహన్ రెడ్డి గారు.. గ్రూపు-2 ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25 న.. గ్రూపు-1 ప్రిలిమ్స్ మార్చి 17 న... అంటే ఈ రెండింటికీ మెయిన్స్ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోనే జరగుతాయి.... అంటే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ప్రిలిమ్స్ పరీక్షలు కూడా ఇప్పుడు జరిగే అవకాశం లేదు... ఇదంతా మీకు ముందే తెలుసు... దీన్ని కూడా ఎన్నికల అస్త్రం గానే వాడుకుంటున్నారు.. నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఒక 6నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చేవారు... ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్‌ ఇచ్చి, ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తామనడం నిరుద్యోగుల్ని మోసం చేయడమే.... నిరుద్యోగులు గ్రూపు-1, గ్రూపు-2 ఈ రెండింటికీ దరఖాస్తు చేసుకుంటారు... గ్రూపు-2లో లో కన్న .. గ్రూపు-1 లో అదనపు సబ్జెక్టు లు అడ్మినిస్ట్రేటివ్ సైకాలజీ, కరెంట్ ఎఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ లు ఉంటాయి.. గ్రూపు-2 ప్రిలిమ్స్ జరిగిన 20 రోజుల్లోనే గ్రూపు-1 అదనపు సబ్జెక్టులకు అభ్యర్థులు సిద్ధం కావడం చాలా కష్టమని నిరుద్యోగులు వాపోతున్నారు.. ఇలాంటి చిన్న చిన్న లాజిక్ లు మరచిపోయి ఎన్నికలలో మీ మోసపూరిత మ్యానిఫెస్టో మాదిరిగా ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులలో గందరగోళం సృష్టిస్తున్నారు.. ఈ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధం కావటానికి కనీసం 4 నెలలు పడుతుంది తగిన సమయం ఇవ్వకుండా డిసెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చి, ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు ఈ సమయ ఒత్తిడి ని ఎలా తట్టుకుంటారు... చివరికి ఏదోలా కష్టపడి పరీక్షలకు సిద్ధమైన తరుణంలో ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే వారి పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా ? రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్య పడాల్సిన అవసరం లేదు... భవిష్యత్తు మనదే... రేపు అధికారంలోకి రాబోతుంది చంద్రన్న ప్రభుత్వమే...... 2014-19 మధ్య ఎంతో మందకి ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తును చూపిన దార్శినికుడు గారు... 2024లో మీ పోస్టులను భర్తీ చేసి, మీ ఉద్యోగాలను మీకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది...




No comments:

Post a Comment