BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Universities Recruitment 2026: Notification for 1523 Vacancies Notification Released Now... Apply Soon                                 

Monday, 25 May 2026

మెగా డిఎస్సినా? దగా డిఎస్సినా? - ఏపీ మెగా డీఎస్సీ లో భారీ స్కాం? | జగన్ పై లోకేష్ ఫైర్ | పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన | AP DSC 2026

మెగా డిఎస్సినా? దగా డిఎస్సినా?

ఏపీ మెగా డీఎస్సీ లో భారీ స్కాం? | జగన్ పై లోకేష్ ఫైర్ | పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన | AP DSC 2026


మెగా డిఎస్సినా? దగా డిఎస్సినా?

పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం • 

వైసిపి అధినేత వైఎస్ జగన్ 

కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డిఎస్సినా? దగా డిఎస్సినా? పేపర్లు లీకు, డేటా డిలీట్ అయ్యాయని, మెరిట్ లిస్టు మాయమైందని, దీనిపై ముఖ్యమంత్రి ఏమి సమాధానం చెబుతారు? అని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ సోమవారం స్పందించారు. వైసిపి హయాంలో ఇచ్చిన డిఎస్ సిని రద్దుచేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నారని తెలిపారు. తీరా పరీక్షల్లో చేసిన నిర్వాకాలు, స్కామ్ | లతో ఉద్యోగార్థులకు ద్రోహం జరిగిందని పేర్కొన్నారు. విద్యాశాఖలో లీకులతో సాగిన 'డార్క్ ఆపరేషన్'ను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఆర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారో బయటపెట్టాలన్నారు. ఎంపికైన వారికి మాత్రమే నేరుగా మెసేజ్ లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. రూ.15 లక్షలకు 'స్పోర్ట్స్ కోటా పోస్టుల బేరసారాలాడారని, ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగుపెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఇంటికే పిలిచి ఒప్పందాలు కుదిర్చారని, రిక్రూట్ మెంటు వేలం పాటలా మార్చేశారని వివరించారు. ఇలా జరిగితే ప్రతిభ ఉన్నవారి మాటేమిటో సమాధానం చెప్పాలని కోరారు. టెట్ కన్వీనర్ ఉన్న అధికారే డిఎస్సి పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనరు తొలగించి విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ను డిఎస్ కన్వీనర్ పెట్టడం వెనుకు మతలబు ఏమిటన్నారు. దీనికి సంబంధిత శాఖ మంత్రి బాధ్యత వహించాలని, సిబిఐ దర్యాప్తును కోరాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.


16 వేల మంది టీచర్లకు జగన్ క్షమాపణ చెప్పాలి 

త్వరలో మరో డీఎస్సీ.. 

ఏడవడానికి సిద్ధంగా ఉండండి ఎక్స్ జగన్ మంత్రి నారా లోకేష్ ఫైర్

 వైసీపీ అధినేత జగన్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. మీరు టె స్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరమని లోకేష్ వ్యాఖ్యానించారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికై న టీచర్లు అందరికీ జగన్ లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్న మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని మంత్రి నారా లోకేష్ అన్నారు.

 Watch this video for more information



No comments:

Post a Comment