BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Universities Recruitment 2026: Notification for 1523 Vacancies Notification Released Now... Apply Soon                                 

Saturday, 25 July 2026

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్‌ బ్యాంకుల్లో 338 ఉద్యోగాల

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) 2026 కు సంబంధించి వివిధ జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంకుల్లో 338 ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలయింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ APCOB Careers ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కీలక వివరాలు (Key Details)
  • మొత్తం ఖాళీలు: 338 పోస్టులు.
  • పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ - 295, స్టాఫ్ అసిస్టెంట్ - 43.
  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 జులై 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 07 ఆగస్టు 2026.
  • పరీక్ష తేదీ: ఆగస్టు/సెప్టెంబరు 2026 లో ఉండవచ్చు
అర్హతలు (Eligibility Criteria)
  • విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌ మరియు స్థానిక భాష (తెలుగు)పై పట్టు ఉండాలి.
  • వయోపరిమితి: 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది).
  • స్థానికత: అభ్యర్థి ఏ జిల్లాకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో, ఆ జిల్లాకు చెందిన వారై ఉండాలి
ఎంపిక విధానం & పరీక్షా సరళి (Selection Process)
ఆన్‌లైన్ రాత పరీక్ష (Online Written Exam) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. 
  • మొత్తం మార్కులు: 200 మార్కులు (200 ప్రశ్నలు).
  • సమయం: 120 నిమిషాలు.
  • నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 (1/4) మార్కు కోత విధిస్తారు.
  • సబ్జెక్టులు: రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఫైనాన్స్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్
దరఖాస్తు రుసుము (Application Fee)
  • OC / BC / EWS అభ్యర్థులకు: ₹826.
  • SC / ST / దివ్యాంగులు / ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు: ₹590. 
Official Website
https://apcob.bank.in/careers/


Watch this video for more information




 

Sunday, 19 July 2026

NATIONAL INSURANCE JOBS 2026| NICL 500 ASSISTANT JOBS| INSURANCE JOBS| NICL RECRUITMENT 2026

 NATIONAL INSURANCE JOBS 2026| NICL 500 ASSISTANT JOBS| INSURANCE JOBS| NICL RECRUITMENT 2026

ఎన్ఎసీఎల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ఐసీఎ అసిస్టెంట్ పోస్టులుల్) క్లాస్-III కేటగిరీలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. 

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టు పేరు: అసిస్టెంట్ (క్లాస్ III). 

మొత్తం ఖాళీలు: 500. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులుయి తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ప్రాంతీయ భాషలోచదవడం, రాయడం, మాట్లాడటంలో తప్పనిసరిగా నైపుణ్యం కలిగి ఉండాలి. 


వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. అప్లికేషన్ ప్రారంభం: జులై 18. 

లాస్ట్ డేట్: ఆగస్టు 7. ఫేజ్-1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ తేదీ: ఆగస్టు 27. ఫేజ్-II ఆన్లైన్ ఎగ్జామినేషన్ తేదీ: అక్టోబర్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్ - ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఫేజ్-II ఆన్లైన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ nationalinsurance.nic.co.inను సందర్శించండి.


OFFICIAL WEBSITE

https://nationalinsurance.nic.co.in/recruitment


FOR MORE DETAILS WATCH THIS VIDEO






Sunday, 12 July 2026

AP DEECET WEB OPTIONS STARTED - డీసెట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం

 డీసెట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం

AP DEECET WEB OPTIONS STARTED


 ప్రభుత్వ డైట్, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన డీసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైందని డీసెట్ కన్వీనర్, గుంటూరు ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు. డిసెట్ అర్హత సాధించిన ర్యాంకు హోల్డర్లు ఈనెల 15 వరకు తాము ప్రవేశం కోరుకునే కళాశాలలకు ప్రాధాన్యత క్రమంలో వె ప్షన్లు పెట్టుకోవాలి. 16న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. 19నుంచి 23 వరకు ప్రభుత్వ డైట్లలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనకు అభ్యర్థులు తమ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో పాటు తమ విద్యార్హతల ఇతర ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థులకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఆధారంగా అభ్యర్థులు తమకు సీటు వచ్చిన కళాశాలలో చేరాలి. ఈనెల 25నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభ మవుతాయని లింగేశ్వరరెడ్డి తెలిపారు.


FOR MORE INFORMATION 

WATCH THE BELOW VIDEO.....



ప్రసూతి సెలవులు రాజ్యాంగ హక్కు

 ప్రసూతి సెలవులు రాజ్యాంగ హక్కు

అది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు, జమ్ముకశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు

 ప్రసూతి సెలవులు రాజ్యాంగబద్ధంగా Maternity మహిళలకు దక్కే హక్కు అని.. దాన్ని ప్రభుత్వం leave ఇచ్చే దానంగా చూడలేమని జమ్ము-కశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వారికి చెల్లించాల్సిన ప్రసూతి సెలవుల వేతనాన్ని పనిచేయలేదనే ఉత్త ర్వుల పేరుతో రద్దు చేయలేరని జస్టిస్ రజ్నేష్ ఒస్వాల్ స్పష్టం చేశారు. సెలవుల్లో ఉన్న మహిళా డాక్టర్లకు వేతనాన్ని నిరాకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. వెంటనే వారికి పూర్తి జీతాలను విడుదల చేయాలని ఆదేశించింది. 




ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. 

జమ్మూకశ్మీర్ ఆరోగ్యశాఖ 2025 అక్టోబర్ 24న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం అప్పటికి ప్రసూతి సెలవుల్లో ఉన్న మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందికి జీతాలను నియంత్రించాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు ఈ ఉత్తర్వు లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.