BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Friday 5 January 2024

AP DSC 2024| AP TET| TS DSC 2024| TS TET 2024| ఉపాధ్యాయులకు ‘టెట్‌’ బెంగ...


AP DSC 2024| AP TET| TS DSC 2024| TS TET 2024|  ఉపాధ్యాయులకు ‘టెట్‌’ బెంగ



ఉపాధ్యాయుల పదోన్నతులకు టె ట్‌ అర్హత సాదించాలన్న నిబంధన పలువురిలో ఆందోళన కలిగిస్తోంది. టె ట్‌ అర్హతతోనే ఉపాధ్యాయుల పదోన్నతి కల్పించడానికి సర్కారు కసరత్తు లు చేస్తుండడం సీనియర్‌లను ఆందోళన బాట వైపు నడిపిస్తోంది. 2011 సంవత్సరానికి ముందు టెట్‌ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర ప రీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్‌ ఉత్తీర్ణత ఉండాలనే వా దన సరికాదని పలువురు ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పదోన్నతికి టెట్‌ అర్హత తప్పని సరిగా చేయాలని కోరు తూ 2017 తదుపరి టీచర్లుగా చేరిన పలువురు ఉపాధ్యాయులు గతంలో న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. ప్రస్తుతం టెట్‌ అర్హతతోనే పదోన్నతుల ప్రక్రియకు యోచిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఉపా ధ్యాయులు నిరసన కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నారు.

అంతర్గత టెట్‌ నిర్వహణ..

రాష్ట్రంలో దాదాపుగా 96 వేల మంది టెట్‌ అర్హత లేకుండా టీచర్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారన్న అంచనా ఉంది. 2017 తదుపరి నియమి తులైన వారికే టెట్‌ అర్హత ఉంది. ఈ లెక్కన అర్హత ఉన్న వాళ్లు సుమారు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పలువురు టీచర్లు, సంఘాల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్‌ అర్హత పొందేలా ప్ర భుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇం దుకు సర్వీసులో ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా వీలు పడని పక్షంలో ప్రత్యేక జీవో జారీ చేసి పదోన్న తులలో టెట్‌ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టెట్‌ పరీక్ష రాయాలంటే 45 ఏళ్ల లోపు ఉండాలన్న నిబంధన ఉంది. సర్వీసులో ఉన్న పలువురు ఉపాధ్యాయులు కొందరు పదవీ విర మణ వయస్సుకు సైతం సమీపంలో ఉన్నారు. ఈ వయస్సులో తాము టె ట్‌ రాసేదెలా...అర్హత పొందేదెలా అని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా టెట్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు సైతం కాలపరిమితి నిబంధనను సర్కారు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పదోన్నతులకు టెట్‌తో ముడి...

ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులకు టెట్‌ ఉత్తీర్ణత ఉండాలనే నిబంధన చా లా రోజుల నుంచి ఉన్నా ..ఇది తప్పనిసరి చేయాలని విద్యాశాఖ తుది ని ర్ణయానికి వచ్చింది. దీంతో జిల్లాలోని 6 వేలకు పైగా సీనియర్‌ ఉపాధ్యా య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన అక్టోబరులో ఉపాధ్యాయ ఉన్నతుల ప్రక్రియ నిలిచిపోగా, తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2008లో తొలిసారి టెట్‌ నిర్వహించగా, తరువాత కొన్నేళ్లకు నేషనల్‌ కౌన్సి ల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) ప్రతి ఉపాధ్యాయుడికీ ఉత్తీర్ణత తప్పని సరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కానీ 2008కి ముందు ఉపాధ్యాయులుగా ఎన్నికైన చాలా మందికి టెట్‌ అర్హత లేదు. ఇలాంటి వారందరి పదోన్నతి ప్రస్తుతం ప్రశ్నార్థకం కానుంది.



No comments:

Post a Comment