BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Tuesday 2 May 2023

RBI Grade B Officer Recruitment 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 291 పోస్టులు...

RBI Recruitment: నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే..


నిరుద్యోగులు, బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఒక గుడ్‌న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన గ్రేడ్ బీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు తెలుసుకుందాం.

ఆర్బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ(DR)-జనరల్, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ B (DR)- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ (DR)- స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు మే 9 నుంచి అధికారిక పోర్టల్ opportunities.rbi.org.in లో అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ జూన్ 9తో ముగియనుంది. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ(DR)-జనరల్ నుంచి 222 పోస్టులు, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ B (DR) డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ నుంచి 38 పోస్టులు, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ (DR)- స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ నుంచి 31 పోస్టులను ఈ ఏడాది భర్తీ చేయనున్నారు.

జీతం ఎంత?
గ్రేడ్ B ఆఫీసర్ విభాగంలోని ఉద్యోగాలకు నెలకు రూ.55,200 జీతం ఉంటుంది. ఆఫీసర్స్ గ్రేడ్ ‘B’(DR)- DEPR ఉద్యోగానికి సెలక్ట్ అయిన వారికి జీతం నెలకు రూ. 44500 నుంచి జీతం ప్రారంభమవుతుంది. నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్స్, బెనిఫిట్స్ వర్తిస్తాయి.

అర్హత ప్రమాణాలు
గ్రేడ్ B ఆఫీసర్(DR) - (జనరల్)
ఈ పోస్ట్‌కు అప్లై చేసుకోవాలనుకునే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం స్కోర్ చేసి ఉండాలి. పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసిన జనరల్, ఓబీసీ అభ్యర్థులైతే ఓవరాల్‌గా 55 శాతం స్కోర్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాస్ మార్కులు సాధిస్తే సరిపోతుంది.

గ్రేడ్ B ఆఫీసర్ (DR) - DEPR
ఈ ఉద్యోగానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్స్, ఫైనాన్స్‌లో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లేదా కనీసం 55% మార్కులతో PGDM/ MBA ఫైనాన్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎకనామిక్స్ సబ్ కేటగిరీలో అగ్రికల్చరల్, బిజినెస్, డెవలప్‌మెంట్, అప్లైడ్‌ వంటి వాటిపై కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పూర్తిచేయాలి.

గ్రేడ్ బీ ఆఫీసర్ (DR)-DSIM
ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్స్‌ లేదా ఐఐటీ- బాంబే నుంచి అప్లైడ్ స్టాటిస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కనీసం 55% మార్కులతో పాసై ఉండాలి. లేదా కనీసం 55% మార్కులతో మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా స్టాటిస్టిక్స్, సంబంధిత సబ్జెక్టుల్లో ఒక సంవత్సరం పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 55% మార్కులతో M స్టాట్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా ఐఎస్‌ఐ కోల్‌కతా, IIT ఖరగ్‌పూర్, IIM కలకత్తా సంయుక్తంగా అందించే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (PGDBA) కోర్సులో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ
ఆర్బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ల పోస్ట్‌ల భర్తీ కోసం ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్, రెండో దశలో మెయిన్స్, చివరగా ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఈ పరీక్షలు జులై 9 నుంచి ఆగస్టు 8 మధ్య జరుగుతాయి. ఈ మూడు పోస్టులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించనున్నారు.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ opportunities.rbi.org.in విజిట్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి ‘గ్రేడ్ బీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్-2023‌’పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

- అక్కడ అవసరమైన వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. ముంబైకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను జనరేట్ చేస్తుంది.

- తర్వాత లాగిన్ అయి అడ్వర్టైజ్‌మెంట్ పేజీలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఫిలప్ చేయాలి.

- అనంతరం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ప్రివ్యూ చూసుకున్న తరువాత సబ్‌మిట్ చేయండి.


Watch Video for more details.....

No comments:

Post a Comment