BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Saturday 17 September 2022

SSC CGL (Combined Graduate Level)-2022 Notification

SSC CGL-2022:  డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వంలో GROUP - B & C  ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

★ మొత్తం పోస్టులు: 20,000

★ Qualification: Any Degree

★ Salary: from Pay Scale Rs 25,500 to  1,51,100



ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు ఉద్యోగ నియామకాలనుచేపడుతున్నాయి. ఈ జాబితాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కూడా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వంలోనివివిధ శాఖల్లో క్లర్క్ (Clerk) పోస్టులను భర్తీ చేస్తుంది. తాజాగా గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష (CGL Exam) ను నిర్వహించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ మొదటి వారంలో ముగియనుంది.

SSC CGL-2022: తాజాగా గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను నిర్వహించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* Eligibility

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం గ్రాడ్రుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీజీఎల్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

* Selection Process

కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్-2022 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా 200 మార్కులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్- టైర్ 1పరీక్ష ఉంటుంది. టైర్ 1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు, టైర్ 2 పరీక్ష రాయడానికి అర్హులు. టైర్ 1, 2 పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. టైర్ 2లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు టైర్ 3 పరీక్షకు రాయటానికి అర్హత సాధిస్తారు. ఈ టైర్ 3 పరీక్ష పెన్-పేపర్ మోడ్‌లో జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి చివరి దశ పరీక్ష టైర్-4లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగానికి అర్హత సాధించినట్లే.

Application Process

- ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ ssc.nic.inను సందర్శించాలి.

- హోమ్‌పేజీలో, లెటెస్ట్ న్యూస్ సెక్షన్‌ను చెక్ చేసి, సంబంధిత లింక్‌పై క్లిక్ చేయాలి.

- లాగిన్ కోసం తమ వివరాలతో అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోవాలి.

- తరువాత లాగిన్ అయి, దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

- చివరగా దరఖాస్తు రుసుము చెల్లించి, అప్లికేషన్‌ను సబ్మిట్‌ చేయాలి.

 దరఖాస్తు రుసుము

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష కోసం జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఇక రిజర్వ్‌డ్ కేటగిరి అభ్యర్థులైతే దరఖాస్తు సమయంలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


* Required Documents

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష కోసం దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, ఓటరు కార్డు, పాన్ కార్డు, స్కూల్ పాస్ సర్టిఫికేట్లు, మార్కుషీట్లు, గ్రాడ్యుయేషన్ పాస్ సర్టిఫికేటు, మార్కు షీట్లు, కేటగిరీ సర్టిఫికేట్( వర్తిస్తే), పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతాయి.

No comments:

Post a Comment