ప్రసూతి సెలవులు రాజ్యాంగ హక్కు
అది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు, జమ్ముకశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు
ప్రసూతి సెలవులు రాజ్యాంగబద్ధంగా Maternity మహిళలకు దక్కే హక్కు అని.. దాన్ని ప్రభుత్వం leave ఇచ్చే దానంగా చూడలేమని జమ్ము-కశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వారికి చెల్లించాల్సిన
ప్రసూతి సెలవుల వేతనాన్ని పనిచేయలేదనే ఉత్త
ర్వుల పేరుతో రద్దు చేయలేరని జస్టిస్ రజ్నేష్
ఒస్వాల్ స్పష్టం చేశారు. సెలవుల్లో ఉన్న మహిళా డాక్టర్లకు వేతనాన్ని నిరాకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. వెంటనే వారికి పూర్తి జీతాలను విడుదల చేయాలని ఆదేశించింది.
ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ..
జమ్మూకశ్మీర్ ఆరోగ్యశాఖ 2025 అక్టోబర్ 24న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం అప్పటికి ప్రసూతి సెలవుల్లో ఉన్న మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందికి జీతాలను నియంత్రించాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు ఈ ఉత్తర్వు లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
No comments:
Post a Comment