గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8కి వాయిదా
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు చోటుచేసుకుంది. డిసెంబర్ 18న జరగాల్సిన ఈ పరీక్షను పాలనా పరమైన కారణాలతో మరో తేదీకి మార్పు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే, ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు కొత్త తేదీని నిర్ణయించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ టైమింగ్స్ ప్రకారమే ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మొత్తం 92 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేసేందుకు అక్టోబరు 13నుంచి నవంబర్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు.
ఇంజినీరింగ్లో 79శాతం సీట్లు భర్తీ
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళా శాలల్లో కన్వీనర్ కోటాలో 79.45శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మూడో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను శుక్రవారం కన్వీనర్ నాగరాణి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 250 కళాశాలల్లో 1,13,403 సీట్లు ఉండగా.. వీటిల్లో 90,100 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 23,303 సీట్లు మిగి లిపోయాయి. విశ్వవిద్యాలయాల కళాశాలల్లో 6,618 సీట్లు ఉండగా.. 5,111 సీట్లు నిండగా మరో 1,507 సీట్లు మిగి లాయి. ప్రైవేటు కళాశాలల్లో 1,02,918 సీట్లకుగాను 81,411 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం కోటా కింద 3,867 సీట్లు ఉంటే 3,578 మంది ప్రవే శాలు పొందారు. ఈఏపీ సెట్ లో 1,73,572 మంది అర్హత సాధించగా.. వీరిలో 104,408 మంది కౌన్సెలింగ్కు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,04,311 మంది వెబస్ఐచ్చికాల నమో దుకు అర్హత పొందారు. మూడో విడత కౌన్సెలింగ్ 24,142 మంది వెబచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. ఈ విడతలో కొత్తగా 3,458మంది సీట్లు పొందారు. మరో 9,958 మంది కోర్సులు, కళాశాలలు మారారు.
పాఠశాలల పరీక్షల షెడ్యూల్ ఖరారు
రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే వివిధ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఇటీవల వివిధ జిల్లాల విద్యా శాఖ అధికారులు, జిల్లా కామన్ పరీక్షల బోర్డుల అధికారులు తో నిర్వహించిన వెబ్ ఎక్స్ సమావేశంలో ఈ షెడ్యూల్పై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
ట్రిపుల్ ఐటీలో ఇంటర్ తరహా పరీక్షలు
🎙️ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ
🔶పీయూసీ విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు నిర్ణయం
బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పరీక్షలకు బదులు ఇంటర్మీడియట్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఇదే అంశంపై ‘సాక్షి’ పత్రిక గతంలోనే కథనాలను ప్రచురించింది. తాజాగా ఆ విషయాన్నే ఇన్‌చార్జి వీసీ ప్రకటించారు. మొదటి రెండు సంవత్సరాల పీయూసీ–1, 2 చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
🌀శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ ఐటీ ఆధునీకరణకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి శనివారం వర్సిటీ సందర్శనకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని వివరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలు కూడా త్వరలో ట్రిపుల్ ఐటీని సందర్శిస్తారన్నారు.
💥డిసెంబర్‌లో స్నాతకోత్సవం
💠బాసర ట్రిపుల్ ఐటీలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్‌లో నిర్వహిస్తామని ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ1, ఈ2 విద్యకు అవసరమయ్యే 2,200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు సమకూర్చినట్లు వెల్లడించారు. యూనిఫామ్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థులకు అవసరమయ్యే బూట్లను తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీ సంస్థ సరఫరా చేస్తుందని చెప్పారు.
🥏ట్రిపుల్ ఐటీ అవసరాల దృష్ట్యా మరో 24 తరగతి గదులను ప్రస్తుత భవనాలపై నిర్మిస్తామని వెల్లడించారు. కాగా, కళాశాలలోని 27 ఎకరాలలో ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ తెలిపారు. రూ.3 కోట్లతో యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించన్నుట్లు ఆయన చెప్పారు. కళాశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను కలిసేందుకు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఇన్‌చార్జి వీసీ.. ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో వీసీ డాష్ బోర్డు, విద్యార్థుల ఈ–ప్రొఫైల్ పోర్టల్‌ను ప్రారంభించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో పైరవీ బదిలీల అలజడి
♦️నేతల సిఫార్సులతో 140మంది జాబితా
ఉపాధ్యాయుల సాధారణ బది లీలకు ముందు వైరవీ బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. రాజకీయ సిఫార్సుల బదిలీల దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. వీటికి ఆమోదం తెలిపిన తర్వాత సాధారణ బదిలీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం బావిస్తున్నట్లు సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైకాపా నేతల సిఫార్సులతో 140మంది ఉపాధ్యాయుల బదిలీకి జాబితా సిద్ధం చేశారు. ఒక దస్త్రంలో 120 మంది పేర్లు ఉండగా.. మరో దస్త్రంలో 20 మంది జాబితా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం ఉంది. ఈ సమయంలో విచక్షణాధికారంతో బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కారణంగానే ఆగస్టులో నిర్వహిస్తామన్న బదిలీలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోందని విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ పూర్తయినా బదిలీలను మాత్రం చేప ట్టడం లేదు. పదోన్నతుల అనంతరం కొత్తగా పోస్టింగ్లు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మౌనం వహిస్తు న్నారు. పైరవీ బదిలీలు పూర్తయిన తర్వాత సాధారణ బదిలీలు చేపడితే రాజకీయ బలం లేని ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారు. అయితే అక్రమంగా బదిలీలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వెంక టేశ్వర్లు, ప్రసాద్ హెచ్చరించారు.
Watch this video for more information regarding this...
No comments:
Post a Comment