నిరుద్యోగులకు శుభవార్త..రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
RRB ALP Recruitment :
భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 20 నుంచి అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.inలో ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు రేపటి నుంచి(శనివారం)అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 19 చివరితేది. ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
10వ తరగతి ఉత్తీర్ణులై, ITI సర్టిఫికేట్ కలిగి ఉన్నవాళ్లు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు. 45 ఏళ్లు పైబడిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు రుసుము, పరీక్షా కేంద్రం మొదలైన అన్ని వివరాల కోసం కింద విషయాలను జాగ్రత్తగా చదవండి.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి ఎంత?
కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు ఉండాలి. అంతేకాకుండా, పలువురు అభ్యర్థులకు వయో సడలింపు కూడా లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి
RRB ALP Recruitment 2024 అప్లయ్ చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి
దరఖాస్తు రుసుము
మహిళలు/EBC/SC/ST/మాజీ-సర్వీస్‌మెన్/ట్రాన్స్‌జెండర్/మైనారిటీలకు దరఖాస్తు రుసుము రూ. 250. ఇతర అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము:- రూ. 500
No comments:
Post a Comment