ఈ రోజు కమిషనర్ గారి వెబ్ మీటింగ్:
డిసెంబర్ 5 నుండి 10th class 100 days action plan అమలు చేస్తారు.
DSC 25 అభ్యర్ధులు assessment book మీద అవగాహన కలిగి ఉండాలి.
స్కూల్ టైమ్ లో CL పెట్టకుండా కమిషనర్ ఆఫీస్ కి వస్తే డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాము.
NOVEMBER 15 నాటికి కొత్త టీచర్ల లీవ్ అప్డేట్, డిజిటల్ SR రెడీ చేయటం జరుగుతుంది.
DSC 2025 ఉపాధ్యాయుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టటం జరుగుతుంది.
మంచి ఫలితాలు కోసం కృషి చేయండి.
LEAP APP లో ఆర్డర్స్ ఇవ్వబడతాయి.
13 వ తేదీ నుండి పాఠశాలలకు హాజరు కావాలి.
రాష్ట్ర భవిష్యత్తు నూతన ఉపాధ్యాయుల చేతిలో ఉంది
ప్రెస్ ఇన్ఫర్మేషన్ మెగా డి ఎస్ సి... ☑
పత్రికా సమాచారం
పూర్వ తూర్పు గోదావరి జిల్లాలో మెగాడిఎస్సి 2025 సందు ఎంపిక కాబడిన నూతన ఉపాధ్యాయులకు ది.03.10.2025 నుండి 10.10.2025 వరకు రెసిడెన్సియల్ విధానం లో ఎనిమిది రోజులపాటు ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతముగా నిర్వహించడమైనదని ముగింపు సమావేశానికి హాజరైన ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా విద్యాశాఖాధికారి. కాకినాడ శ్రీ పి. రమేష్ తెలియచేశారు.
ట్రైనింగ్ పూర్తిచేసుకున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు 09.10.2025న ఆర్.ఐ.ఎఫ్.టి. ఇంజనీరింగ్ కాలేజ్, సిడింగొయ్యి, భూపాలపట్నం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరిజిల్లా నందు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా పాఠశాలయందు నియామక ఉత్తర్వులు ఇవ్వడమైనది.
స్కూల్ అసిస్టెంట్ మరియు పి.జి.టి కేడర్ ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆర్డరు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా కేటాయించబడతాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి జిల్లాలో మెగా డియస్సీ - 2025 ద్వారా నియామకం పొందిన అందరు ఉపాధయులు వారి యొక్క వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. అభ్యర్ధులకు వారి యొక్క డియస్సీ మెరిట్ ర్యాంక్ ఆధారంగా వారు ఎంపిక చేసుకున్న ఆప్షన్ల మేరకు పోస్టింగ్ ఆర్డర్లు ఆన్లైన్ లో జనరేట్ అవుతాయి.
ట్రైనింగ్ పూర్తిచేసుకున్న అన్నీ కేడర్ల ఉపాధ్యాయులు వారియొక్క నియామక ఉత్తర్వులను రీప్ యాప్ సందరి వ్యక్తిగత లాగిన్ నుండి డౌన్లోడ్ చేసుకుని 15.10.2025న వారికి కేటాయించబడిన పాఠశాలల్లో విధులలో చేరవలసి ఉంటుంది. వారి యొక్క విధులలో చేరిన తేదీ ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరైన తేదీ నుండి అనగా 03.10.2015 నుండి పరిగణించబడుతుందని, మేరకు నూతన ఉపాధ్యాయుల సేవా పుస్తకంలో వివరాలను నమోదు చేయాలని పూర్వ తూర్పుగోదావరి జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులను ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ శ్రీ పి. రమేష్ ఆదేశించారు.
ది 03.10.2025 నుండి 10.10.2025 వరకు నిర్వహించబదిన ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరు కాని అభ్యర్థులు తదుపరి విడతలో నిర్వహించే ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరై, ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారి యొక్క హాస్టింగ్ ఆర్డరు పొందవలసి ఉంటుంది.
DEO EGDT
Watch this video for more information
No comments:
Post a Comment