AP Mega DSC New Teachersను రిలీవ్ చేయండి
మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి
మెగా డీఎస్సీ ఉపాధ్యాయులను రిలీవ్ చేయండి ఏపీటీఎఫ్ అమరావతి
వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఎంపికైన మెగా డీఎస్సీ ఉపాధ్యాయులను అధికారికంగా సమాంతర రిలీవింగ్ తేదీని ప్రకటించాలని ఎపిటిఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు సివి ప్రసాద్ కోరారు. అన్ని విభాగాలకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. ఎన్ ఓ సి కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిని రిలీవింగ్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ వెల్ఫేర్ ,బీసీ వెల్ఫేర్ సంస్థలలో ఎన్వోసీ జారీ చేసినట్లే ఏపీ రెసిడెన్షియల్ విభాగంలో కూడా ఎన్ఓసి ఇచ్చేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ విషయంలో నెలకొన్న సందిగ్ధతను ప్రభుత్వం నివారించాలని కోరారు. పాత సర్వీస్, పే ప్రొటెక్షన్, నిల్వలో ఉన్న సెలవులు అన్ని రీస్టోర్ అయ్యేటట్లు ఎస్ ఆర్ ను కొనసాగించాలని కోరారు.
అక్టోబర్ ఒకటో తేదీ నాడు కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించి 3వ తేదీన విధుల్లో చేరేటట్లు చూడాలని 4 వ తేదీ నుంచి ట్రైనింగులు ప్రారంభించాలని సూచించారు.కొత్త ఉపాధ్యాయులకు రెగులరైజేషన్ , డిక్లరేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ కార్యక్రమాలు పూర్తి చేయుటకు అధికారాలను ఎంఈఓ లకు బదలాయించాలని కోరారు. నియామక పత్రం అందిన తేదీ నుండి 30 రోజుల్లో ఎప్పుడైనా ఉద్యోగం లో చేరవచ్చని వివరించారు.
Watch this Video for more information
No comments:
Post a Comment